నల్గొండ జిల్లా నేతతో పాటు పోలీస్ అధికారి అరెస్ట్! | gangstre nayeem encounter: A political leader and police officer arrested in bangalore | Sakshi
Sakshi News home page

నల్గొండ జిల్లా నేతతో పాటు పోలీస్ అధికారి అరెస్ట్!

Published Mon, Oct 3 2016 2:49 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

నల్గొండ జిల్లా నేతతో పాటు పోలీస్ అధికారి అరెస్ట్! - Sakshi

నల్గొండ జిల్లా నేతతో పాటు పోలీస్ అధికారి అరెస్ట్!

గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నేతతో పాటు పోలీస్ అధికారిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ నేతతో పాటు పోలీస్ అధికారిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరిద్దర్నీ బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ అధికారులు మాత్రం అరెస్ట్లను అధికారికంగా ధ్రువీకరించలేదు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా నయాం కేసును విచారిస్తున్న ‘సిట్’ పోలీసులు అధికార టీఆర్‌ఎస్‌తో పాటు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ఉన్న లెసైన్సుడ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారని, కొందరు నేతల ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు  తెలిసింది.

వీరితో పాటు నయీమ్‌తో సత్సంబంధాలు నెరిపిన పోలీసు అధికారుల్లో ఎనిమిది మందికి మెమోలు ఇచ్చినట్లు సమాచారం. తమ సర్వీసు రివాల్వర్లను సరెండర్ చేయాలని ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలను ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement