‘నవీముంబై’ ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు | Green panel clears Navi Mumbai airport | Sakshi
Sakshi News home page

‘నవీముంబై’ ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు

Published Sat, Sep 28 2013 12:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

Green panel clears Navi Mumbai airport

సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై విమానాశ్రయ ప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయినట్టే. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ దేశరాజధానిలో ప్రధాని  మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లను ఆహ్వానించే అవకాశముంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఢిల్లీలో సోమవారం జరగాల్సిన ఉన్నత స్థాయి సమావేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ సమావేశం రద్దు కావడంతో ఈ ప్రాజెక్టు వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉండిపోయింది.
 
అయితే ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చవాన్ తాజాగా జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు మార్గం సుగమమైంది. నవీముంబైలో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ఉప్పు భూముల వివాదం, అటవీ , పర్యావరణ శాఖ అభ్యంతరాలు, స్థానిక ప్రజలు, రైతుల ఆందోళనలు, రాజకీయ నాయకులు జోక్యం తదితర వివాదాల మధ్య చిక్కుకున్న సంగతి విదితమే. 1998లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా ఇప్పుడది దాదాపు రూ 20 వేల కోట్లకు చేరుకుంది. 2015లో ఈ ప్రాజెక్టు తొలి విడత పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement