
రూ.2 కోట్లు కావాలట
సాధారణంగా హీరోయిన్ల కాల్ షీట్స్ , పారితోషికం వ్యవహారాలు వారి తల్లులే చూసుకుంటుంటారు.
సాధారణంగా హీరోయిన్ల కాల్ షీట్స్ , పారితోషికం వ్యవహారాలు వారి తల్లులే చూసుకుంటుంటారు. అలాంటి అవకాశం లేని వారు మేనేజర్లను నియమించుకుంటారు. నటి హన్సిక విషయానికి వస్తే ఆమె తల్లి నిర్మాతల్ని అమ్మో అని భయపెడుతున్నారట. ఆమె విధించే షరతులకు, పెంచుతున్న పారితోషికానికి నిర్మాతలే బెంబేలెత్తి పోతున్నారట. అంతగా, హన్సిక పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ మధ్య విడుదలైన అరణ్మణై చిత్రం తర్వాత హన్సిక పారితోషికాన్ని కోటిన్నరకు పెంచేశారటా. ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న గరుడ చిత్రానికి హన్సిక కోటిన్నర తీసుకుంటున్నట్టు సమాచారం.
ఇక్కడ వరకు బాగానే ఉన్నా, తదుపరి ఆర్యతో నటిస్తున్న మిగామాన్ ఈనెల 25న, విశాల్ సరసన నటిస్తున్న ఆంబళ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల విజయాలపై ఎంతో నమ్మకం పెట్టుకున్న హన్సిక తల్లి ఆ చిత్రాల విడుదలకు ముందే, పారితోషికాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారట. దీంతో కొత్తగా వస్తున్న నిర్మాతలందరినీ రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించడానికి రూ.50 లక్షలు తీసుకున్నారట.
తాజాగా నటిస్తున్న చిత్రంలో ఒక కంపెనీ వాణిజ్య ప్రకటనలో నటించే విధంగా సన్నివేశం చోటు చేసుకుందట. ఇందుకు ఆ చిత్ర నిర్మాత సదరు కంపెనీ నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారట.ఈ విషయం హన్సిక అమ్మ చెవిన పడడంతో అందులో సగం ఇస్తేగానీ, తన కూతురు ఆ వాణిజ్య ప్రకటన సన్నివేశంలో నటించదని కరాఖండీగా చెప్పేసిందట. దీంతో వేరే దారి లేక ఆ నిర్మాత ఆమె డిమాండ్‌కు తల వంచక తప్పలేదు. ఈ విధంగా నటి హన్సిక తల్లి నిర్మాతలను అమ్మో అనిపిస్తున్నట్టు కోలీవుడ్‌లో చర్చ సాగుతున్నది.