ఈ నెల 20న విచారణ జరుపనున్నట్లు తెలిపిన హైకోర్టు
21 మందిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడం రాజ్యాంగ
విరుద్ధమన్న పిల్
సాక్షి, న్యూఢిల్లీ: అర్వింద్ కేజ్రీవాల్ సర్కారు 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ జరపనున్నట్లు ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇంత మందిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడంలో చట్టబద్ధతను, రాజ్యాంగ ఔచిత్యాన్ని సవాలుచేస్తూ రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే ఎన్జీఓ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసింది. సీఎంఅర్వింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమితులైన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలైంది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై మే 20న విచారణ జరపనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి, న్యాయమూర్తి ఆర్.ఎస్. ఎండ్లాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
21 మంది ఆప్ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించి వారిని విభిన్న మంత్రిత్వశాఖలకు అనుసంధానిస్తూ ఆప్ సర్కారు ఏప్రిల్ 13న ఉత్తర్వు జారీ చేసింది. వీళ్లు ఎలాంటి వేతన, భత్యాలు లేకుండా పనిచేస్తారని, వారి వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడబోదని, వారి నియామకం వల్ల ప్రభుత్వ పనితీరు మెరుగవుతుందని ఆప్ సర్కారు తెలిపింది. అయితే పార్లమెంటరీ సెక్రటరీలు అవసరమైనప్పుడు ప్రభుత్వ వాహనం ఉపయోగించుకుంటారని, అనుసంధానించిన మంత్రి కార్యాలయంలోనే వారికి కేటాయించిన స్థలంలో కూర్చుని పనిచేస్తూ అధికార విధుల నిర్వహణలో మంత్రికి సహాయపడతారని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది.
అయితే ఆప్ సర్కారు జారీ చేసి ఈ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ ఆరోపించింది. ఏ చ ట్టం ప్రకారం కూడా పార్లమెంటరీ సెక్రటరీలను నియమించి వారితో ప్రమాణస్వీకారం చేయించే అధికారం ముఖ్యమంత్రికి లేదని పిటిషన్ పేర్కొంది. కనుక ఈ నియమాకం చెల్లదని పేర్కొంది. ఢిల్లీ సర్కారు జారీ చేసే నియామకపు ఉత్తర్వులు లెఫ్టినెంట్ గవర్నర్ పేరు మీద నిర్ధిష్ట పద్ధతి ప్రకారం వెలువడుతాయని పిటిషన్ పేర్కొంది. చట్టవిర్ధుంగా నియమితులైన పార్లమెంటరీ సెక్రటరీలు పనిచేయకుండా అడ్డుకోవాలని పిటిషన్ కోర్టును కోరింది.
ఆప్ పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై విచారణ
Published Wed, May 13 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement
Advertisement