టీనగర్, న్యూస్‌లైన్: చెన్నైలోని పురాతన ప్రభుత్వ ప్రెస్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించిం ది. అనేక దస్తావేజులు కాలిపోయాయి. చెన్నై సెవన్‌వెల్స్ మింట్ స్ట్రీట్‌లో 150 ఏళ్ల నాటి ప్రభుత్వ ప్రెస్ ఉంది. ఇది 13 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రెస్ ఆంగ్లేయుల కాలం నుంచి పనిచేస్తోంది. ఇక్కడ ప్రభుత్వానికి అవసరమైన దస్తావేజులు, బడ్జెట్‌కు సంబంధించిన పేపర్లు, అనేక శాఖల దస్తావేజులు ముద్రిస్తుం టారు. 580 మంది పనిచేస్తున్నారు. గురువారం రాత్రి షిఫ్ట్‌లో 25 మంది పనిచేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఇక్కడున్న టవర్ మిషన్ ప్రాంతంలో భారీ శబ్దం తో పొగలు రావడం సిబ్బంది గమనించారు. ఆర్పేం దుకు యత్నించారు. అయినా మంటలు తగ్గలేదు. అన్ని ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి.
సమాచారం అందగానే బేసిన్ బ్రిడ్జి, ఫ్లవర్ బజార్, రాయపురం, వ్యాసర్పాడి ప్రాంతాల నుంచి 15 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది వచ్చి చాలాసేపు శ్రమించి మంటలు ఆర్పారు. అప్పటికే బడ్జెట్ పేపర్లు, పోలీసు ఎఫ్‌ఐఆర్ పుస్తకాలు, ప్రింటింగ్, బైండింగ్ మిషన్లు కాలిపోయాయి. భవనానికి పగుళ్లు ఏర్పడడంతో కొంతభాగం కూలిపోరుుంది. ఈ ప్రమాదం గురించి సెవన్ వెల్స్ ఇన్‌స్పెక్టర్ సుందరం, పోలీసు సిబ్బంది విచారణ జరుపుతున్నారు. రాష్ట్ర ప్రత్యేక పథకాల అమలు శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
మిషన్‌కు తప్పిన ముప్పు: ఈ ప్రమాదంలో రూ.9 కోట్ల విలువైన జపాన్ ప్రింటింగ్ మిషన్‌కు ముప్పు తప్పిం ది. గతంలో రెండుసార్లు చిన్న అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ప్రస్తుతం పెద్ద ప్రమాదం జరగడంతో ప్రభుత్వ ప్రెస్ పని చేసేందుకు వీలు కలగలేదు.
ప్రభుత్వ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం
Published Sat, Nov 2 2013 6:09 AM | Last Updated on Mon, Aug 20 2018 9:21 PM
Advertisement
Advertisement