గ్లామర్ లేని పాత్రలకు నో | i act only in glamor roles says Kajal Agarwal | Sakshi
Sakshi News home page

గ్లామర్ లేని పాత్రలకు నో

Published Fri, May 15 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

గ్లామర్ లేని పాత్రలకు నో

గ్లామర్ లేని పాత్రలకు నో

గ్లామర్ లేని పాత్రలు చేయనని ఖరాఖండిగా చెబుతున్నారు నటి కాజల్ అగర్వాల్. టాలీవుడ్ నుంచి పూర్తిగా కోలీవుడ్‌పై దృష్టి సారిస్తున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. తెలుగులో ప్రస్తుతం ఒక చిత్రం కూడా లేదామెకు. అక్కడ చివరిగా నటించిన చిత్రం టెంపర్. విచిత్రం ఏమిటంటే ఆ చిత్రం హిట్ అయినా అమ్మడికి కొత్త అవకాశాలు రావడం లేదు. దీంతో కోలీవుడ్‌పై దృష్టి పెట్టారు. ఇక్కడ ధనుష్‌తో మారి, విశాల్ సరసన పాయుంపులి, చిత్రాలతో పాటు మర్మమనిదన్ అనే చిత్రం కూడా చేస్తున్నారు.
 
 టాలీవుడ్‌లో సడన్‌గా మార్కెట్ పడి పోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు కాజల్ బదులిస్తూ అక్కడ అవకాశాలు తగ్గితే ఏమి ఇక్కడ బిజీగానే వున్నాగా అని బదులిచ్చారు. తెలుగులో కొన్ని చిత్రాల్లో నెగిటివ్ పాత్ర నటించాలని అడిగారని చెప్పారు. తాను ప్రతి నాయకి పాత్రల్లో ఎప్పటికీ నటించరాదని నిర్ణయించుకున్నానన్నారు. అదే విధంగా గ్లామర్ తగిన పాత్రలో చేయదలచుకోలేదన్నారు. ఎందుకంటే అభిమానులు తన నుంచి గ్లామర్ పాత్రలనే కోరుకుంటున్నారని అన్నారు. అలాంటప్పుడు తానెందుకు గ్లామర్ లేని పాత్రలు చేయాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు కాజల్ అగర్వాల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement