
సాక్షి ప్రతినిధి, చెన్నై : రాజకీయాల్లో గెలిచి తీరుతానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ధీమా వ్యక్తం చేశారు. ‘మొదట బహిష్కరిస్తారు.. ఆ తర్వాత హేళనగా నవ్వుతారు. వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు. చివరికి గెలుపు నీదే..’ అనే గాంధీ సూక్తి తనకు స్ఫూర్తి అని కమల్‌హాసన్ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.