
వివాహం చేసుకున్న శిల్పి, సాగర్‌లు
కర్ణాటక, మైసూరు : కులాంతర వివాహానికి తల్లితండ్రులు అడ్డు చెప్పడంతో ఒడనాడి సంస్థ సహకారంతో బుధవారం ఆ జంట ఒక్కటైంది. అరవింద నగరకు చెందిన ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న శిల్పి, నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్న సాగర్‌లు రెండేళ్లుగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో శిల్పి తల్లితండ్రులు వివాహానికి అడ్డు చెప్పారు.దీంతో ఒడనాడి సంస్థ సహకారంతో నగరంలోని ఎస్‌ఆర్‌ఎస్ కాలనీలోనున్న ఒడనాడి సంస్థ కార్యాలయంలోనే ప్రేమికులు వివాహం చేసుకొని ఒక్కటయ్యారు.వివాహానికి వరుడు సాగర్ తల్లితండ్రులు కూడా హాజరయ్యారు.