యెమన్ నుంచి చెన్నైకి | Internal strife in yemen country | Sakshi
Sakshi News home page

యెమన్ నుంచి చెన్నైకి

Published Sun, Apr 5 2015 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

Internal strife in yemen country

చెన్నై, సాక్షి ప్రతినిధి:అంతర్గత పోరుతో అట్టుడికిపోతున్న యెమన్ దేశం నుంచి తమిళనాడుకు చెందిన కుటుంబాలు సురక్షితంగా చెన్నైకి చేరుకున్నాయి.  శని వారం ఉదయం రెండు విమానాల్లో 46 కుటుంబాలు వారు చెన్నై విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రైలు, బస్సుల ద్వారా స్వస్థలాకు వెళ్లారు.యెమన్ దేశంలో ఇటీవల ప్రారంభమైన అంతర్గత యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలను నిలువునా హరించి వేస్తోంది. ఏ క్షణాన ఎటునుంచి బాంబులు పడతాయనే భయంతో వేలాది మంది భారతీయులు బతుకుతున్నారు.
 
  ఇందులో తమిళనాడుకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. యుద్ధం ప్రారంభం కాగానే ఆదేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని కొందరు సంప్రదించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పౌరులను సురక్షితంగా భారత్‌కు చేర్చేందుకు చర్యలు చేపట్టారు. యెమన్‌లోని విమానాశ్రయం సైతం తీవ్రవాదుల స్వాధీనంలో ఉన్న కారణంగా భారతీయ విమానాలు అక్కడ దిగే పరిస్థితి లేదు. దీంతో అక్కడికి సమీపంలోని జీపొట్టి అనే విమానాశ్రయానికి భారత్ ఎయి ర్ ఇండియా విమానాలను పంపింది. అక్కడి భారత అధికారులు నౌకల ద్వారా జీపొట్టి విమానాశ్రయానికి, క్కడి నుంచి భారత్‌కు చేరుస్తున్నారు.
 
 రెండు యుద్ధవిమానాలు 350 మంది భారతీయులను ఎక్కించుకుని ముంబయి, కొచ్చిలకు శుక్రవారం చేర్చారు. ముంబయికు చేరుకున్న వారిలో తమిళనాడుకు చెందిన 46 మంది ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులుగా ఆప్‌కో అధికారులు వీరందరికీ స్వాగతం చెప్పి చెన్నై విమాన టిక్కెట్లను అందజేశారు. వీరిలో 37 మంది పురుషులు, 7 మంది స్త్రీలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరిలో 30 మందితో ముంబయిలో శనివారం తెల్లవారుజాము 2.30 గంటలకు బయలుదేరిన విమానం ఉదయం 7.30 గంటలకు చెన్నైకి చేరుకుంది. 16 మందితో బయలుదేరిన మరో విమానం ఉదయం 8 గంటలకు చెన్నైకి చేరుకుంది. వీరందరికీ చెన్నైలోనూ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎమన్‌దేశం నుంచి సురక్షితంగా బైటపడిన వారి బంధు మిత్రులు ఆనందభాష్పాలతో ఆలింగనం చేసుకున్నారు.
 
 క్షణ..క్షణం..భయం...భయం ః సోమసుందరం
 ఏ క్షణాన ఏమూల బాంబులు పడుతాయో అర్థంకాక భయంతో బతికామని తెన్‌కాశీకి చెందిన సోమసుందరం మీడియాతో చెప్పారు. యెమన్‌దేశం కొరోనాలోని ఒక కంపెనీలో తాను ఉద్యోగం చేస్తున్నానని, తాను పనిచేస్తున్న కంపెనీపై కూడా బాంబుల వర్షం కురియడంతో స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందిగా యాజమాన్యం చెప్పిందని తెలిపారు. అయితే ఎటువెళ్లాలో, ఎలా వెళ్లాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే మగ్గిపోయామని చెప్పారు. తినడానికి తిండికూడా దొరకని పరిస్థితిలో ఇరుగు పొరుగున ఉన్న తమిళులు ఆహారం పెట్టి ఆదుకున్నారని తెలిపారు. యుద్ద భయంతో కాలం వెళ్లదీస్తున్న  అనేక తమిళ కుటుంబాలను రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
 
 పదిరోజులుగా నరకం: డాక్టర్ వాణీ వెంకటేశన్
 యుద్ధం ప్రారంభమైన పదిరోజుల నుంచి నరకం అనుభవించామని డాక్టర్ వాణీ వెంకటేశన్ చెప్పారు. చెన్నై వెస్ట్ మాంబళానికి తాను భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి యెమన్‌లో నివశిస్తున్నామని తెలిపారు. తాను వైద్యవృత్తిని నిర్వహిస్తుండగా, తన భర్త వెంకటేశన్ ఒకోడా నగరంలోని ఒక కంపెనీలో అధికారిగా ఉన్నారని తెలిపారు. బాంబులు పడడం ప్రారంభమైన తరువాత ప్రాణభయంతో భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నామని, వారి సహకారంతో సురక్షితంగా చెన్నైకి రాగలిగామని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement