సనా: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్‌లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్(75)ను హతమార్చినట్లు హుతి తిరుగుబాటుదారులు ప్రకటించారు. దేశంలో నెలకొన్న సంక్షోభం ముగిసిందనీ.. సలేహ్, ఆయన మద్దతుదారుల్ని హతమార్చినట్లు తిరుగుబాటుదారుల అధీనంలోని అల్–మసీరా చానెల్ పేర్కొంది. మరోవైపు తిరుగుబాటుదారులు తీవ్రగాయాలతో ఉన్న సలేహ్ మృతదేహాన్ని ట్రక్కులో చేరుస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో కన్పిస్తోంది.
3 దశాబ్దాల పాటు యెమెన్‌ను పాలించిన సలేహ్ అరబ్ విప్లవం నేపథ్యంలో 2012లో ఉద్వాసనకు గురయ్యారు. అనంతరం యెమెన్ అధ్యక్షుడైన మన్సూర్ హదీకి వ్యతిరేకంగా హుతి తిరుగుబాటుదారులతో చేతులు కలిపారు. దీంతో దేశంలో అంతర్యుద్ధం రాజుకుంది. ప్రాణభయంతో హదీ సౌదీ అరేబియాకు పారిపోవడంతో సలేహ్ హుతి రెబల్స్‌తో కలిసి మూడేళ్ల కిత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. కానీ ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో వారం రోజుల క్రితమే సలేహ్ హుతి రెబల్స్ నుంచి విడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment