జన్మభూమి సదస్సులో రసాభాస
Published Mon, Jan 2 2017 3:01 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
సరుబుజ్జిలి: జన్మభూమి సదస్సులో ప్రోటోకాల్ పాటించకపోవడంపై ప్రతిపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం రసాబాసగా మారింది. ప్రోటోకాల్ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య చెలరేగిన వాగ్వాదం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఇది గుర్తించిన పోలీసులు ఇరు వర్గాలను సర్ది చెప్పడానికి యత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మతలపుపేట గ్రామ పంచాయతి కార్యాలయంలో సోమవారం జన్మభూమి సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ, జడ్‌పీటీసీలను పిలవకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సదస్సును అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగి దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Advertisement
Advertisement