సాక్షి, చెన్నైః తమిళ సంస్కృతి సంప్రదాయాలకు ఆకర్షితులైన జపాన్ ప్రేమికుల జంట కొత్త సంవత్సరం వేల సోమవారం మధురైలో ఒకటయ్యారు. హిందూ సంప్రదాయం మేరకు మీనాక్షి అమ్మవారు కొలువుదీరిన మధురైలో వివాహం చేసుకున్నారు. జపాన్‌లోని టోక్యోకు చెందిన యూడో నినాగా అక్కడి విద్యాసంస్థలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ప్రైవేటు విమాన సంస్థలో పని చేస్తున్న సిగారో ఒబాతాను ప్రేమలో పడ్డారు. గత ఏడాది ఏప్రిల్‌లో జపాన్‌లోనే ఈ జంట రిజిస్టర్ వివాహం చేసుకుంది.
యూడో నినాగా, సిగారో ఒబాతాలు తమిళం మీద మక్కువను పెంచుకున్నారు. ఈ ఇద్దరు తమిళ భాషను అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరారు. అదే సమయంలో తమిళ సంస్కృతి సంప్రదాయాల మీద అమిత ఆకర్షితులయ్యారు. దీంతో తమ వివాహాలను మీనాక్షి అమ్మవారు కొలువుదీరిన మధురైలో హిందూ, తమిళ సంస్కృతి మేరకు నిర్వహించేందుకు నిర్ణయించారు.
దీంతో ఆ ఇరువురి కుటుంబ సభ్యులు గత రెండు రోజుల క్రితం మధురై విలాపురానికి చేరుకున్నారు. అందరూ తమిళ కళాచారం మేరకు పంచె, దోవతి, పట్టు చీరలు ధరించారు. మధురై రైల్వే సమీపంలోని ఓ కల్యాణ మండపంలో వివాహ ఏర్పాట్లు చేశారు. కొత్త సంవత్సరం రోజైన సోమవారం సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి స్థానికులు సైతం తరలివచ్చి ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment