‘విద్యార్థుల ఉన్నత విద్యకు జిందాల్ సహకారం’ | Jindal support to higher education for students | Sakshi
Sakshi News home page

‘విద్యార్థుల ఉన్నత విద్యకు జిందాల్ సహకారం’

Published Wed, Nov 20 2013 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి జిందాల్ పౌండేషన్ బాసటగా నిలుస్తోందని జిందాల్ సీఈఓ వినోద్ నావెల్ తెలిపారు.

 తోరణగల్లు, న్యూస్‌లైన్ :  గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి జిందాల్ పౌండేషన్ బాసటగా నిలుస్తోందని జిందాల్ సీఈఓ వినోద్ నావెల్ తెలిపారు. ఆయన మంగళవారం తాళూరులో పాఠశాల విద్యార్థులకు సోలార్ ల్యాంప్‌ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల విద్యాభ్యాసానికి  జిందాల్ ఫౌండేషన్ సహా య సహకారాలు అందిస్తోందన్నారు.
 
  పరీక్షల సమయంలో కరెంటు సమస్య తలెత్తినప్పుడు విద్యార్థులకు ఉపయోగంగా ఉండేందుకు సోలార్ ల్యాంప్‌లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గాదిగనూరు, తాళూరు, కృష్ణానగర్‌లలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 1100 సోలార్ ల్యాంప్‌లను పంపిణీ చేశారు. దశల వారీగా సండూరు తాలూకాలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిందాల్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement