ఆస్పత్రి నుంచి కమల్ డిశ్చార్జ్ | Kamal discharge from the hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి కమల్ డిశ్చార్జ్

Published Thu, Aug 4 2016 7:39 PM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

Kamal discharge from the hospital

నటుడు కమలహాసన్‌ను ఆస్పత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అమెరికాలో తాజా చిత్రం శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చిన కమలహాసన్ గత నెల 13వ తేదీ స్థానిక ఆల్వార్‌పేటలోని తన కార్యాలయం పై అంతస్తు నుంచి కిందకు దిగుతూ మెట్లమీద నుంచి జారిపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన కుడికాలికి గాయమై స్థానిక గ్రీన్స్‌రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమల్‌కు వైద్యులు రెండుసార్లు శస్త్ర చికిత్స నిర్వహించారు. బుధవారం తాను లేచి నిలబడ్డానని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆనందం పెల్లుబికింది. తాజాగా కమల్‌ను గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే కమల్ మరో నెల రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement