గల్లంతైన మరో నటుడి మృతదేహం లభ్యం
Published Thu, Nov 10 2016 11:20 AM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM
హైదరాబాద్: ‘మాస్తిగుడి’ సినిమా క్లైయిమాక్స్ చిత్రీకరణ సమయంలో తిప్పగొండనహళ్లి చెరువులో సోమవారం గల్లంతైన ఇద్దరు కన్నడ నటుల్లో మరొక నటుడి మృతదేహం లభించింది. నటుడు అనిల్ మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. గజ ఈతగాళ్లు, స్థానికులు, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యల చేపట్టగా.. మంగళవారం ఉదయం ఉదయ్ రాఘవ మృతదేహం లభించింది. కాగా అనిల్ ఆచూకీ లభించకపోవడంతో తీవ్రంగా గాలించిన సిబ్బంది ఈ రోజు ఉదయం అనిల్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు.
Advertisement
Advertisement