నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు | Kannada producer, director, stunt director booked | Sakshi
Sakshi News home page

నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు

Published Tue, Nov 8 2016 4:32 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు - Sakshi

నిర్మాత, దర్శకుడిపై కేసు నమోదు

బెంగళూరు: కన్నడ సినిమా 'మాస్తీగుడి' షూటింగ్ సమయంలో ఇద్దరు వర్ధమాన నటులు రిజర్వాయర్లో మునిగి చనిపోయిన ఘటనకు సంబంధించి ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, స్టంట్ డైరెక్టర్, యూనిట్ మేనేజర్పై పోలీసులు కేసులు నమోదు చేశారు. సినిమా షూటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని, చిత్ర నిర్మాత, డైరెక్టర్, స్టంట్ డైరెక్టర్ నిర్లక్ష్యం కారణంగా వారు ప్రాణాలుకోల్పోయారని ప్రాథమిక విచారణ నివేదికలో పోలీసులు నమోదు చేసుకున్నారు.

దునియా విజయ్ హీరోగా, అమూల్య హీరోయిన్‌గా నాగశేఖర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్తీగుడి. బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని రామనగర జిల్లా తిప్పగుండనహళ్లి రిజర్వాయర్ వద్ద సోమవారం సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఉదయ్, స్టంట్‌మ్యాన్ అనిల్ మొదటగా 50 మీటర్ల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకగా.. ఆ సమయానికి రక్షణ బోట్లు రాకపోవడం, వీరికి ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement