క్రిస్మస్‌కి కయల్ | Kayal Movie release on Christmas festival | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌కి కయల్

Published Sun, Dec 14 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

క్రిస్మస్‌కి కయల్

క్రిస్మస్‌కి కయల్

 క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కయల్ చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మైనా, కుంకీ చిత్రాల సృష్టికర్త ప్రభుసాల్మన్ ప్రయోగం కయల్. మైనాతో అమలాపాల్‌ను, కుంకితో లక్ష్మీమీనన్‌ను హీరోయిన్లు గా అందలం ఎక్కించిన ఈ దర్శకుడు తాజాగా కయల్ చిత్రం ద్వారా ఆనందికి నటిగా సరికొత్త జీవితాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్, గాడ్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నవ నటుడు చంద్రన్ కథానాయకుడిగా పరిచ యం అవుతున్నారు. ఆనంది నాయకిగా నటిస్తుండగా విన్సెంట్, ఆర్తి, జెమినీ రాజేశ్వరి, యార్‌కన్నన్, భారతీకన్నన్, జేకాప్, యోగి దేవరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిం చారు.
 
 డి.ఇమాన్ సంగీతాన్ని, వి.మహేంద్రన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం చిత్రంలోని ఒక్క సన్నివేశాన్ని కూడా కట్ చేయకుండా మంచి వైవిధ్యభరిత చిత్రం అంటూ అభినందించి యు సర్టిఫికెట్ ఇచ్చిందని యూనిట్ వర్గాలు తెలిపారుు. సాధారణంగా ప్రభుసాల్మన్ చిత్రాల్లో పాటల కు మంచి ఆదరణ ఉంటుందని ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్నాయని కయల్ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement