విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు | Amala Paul and Vijay heading to LA New Year | Sakshi
Sakshi News home page

విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు

Published Fri, Dec 19 2014 2:55 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు - Sakshi

విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు

 నూతన సంవత్సరం వస్తుందంటే చాలు స్టార్ హీరోయిన్ల నుంచి చిన్నా చితకా తారల వరకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే మన అమలాపాల్, హన్సికలు మాత్రం విదేశాల్లో జరుపుకోవడానికి సిద్ధమయ్యూరు. స్టార్ హోటల్ నుంచి ఫామ్ హౌస్‌ల వరకు పార్టీలు, నృత్యాలంటూ న్యూ ఇయర్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటేవరకు విందు వినోదాలతో మజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో ఏ సినీ తారను ఎంపిక చేయాలన్న విషయాల గురించి హోటళ్ల యాజ మాన్యం, ఎంత పారితోషికం డిమాండ్ చేయాలన్న అంశం గురించి హీరోయిన్లు ఆలోచిస్తుంటారు.
 
 నటి హన్సిక విషయానికొస్తే ప్రతి ఏడాది లాస్‌వేగాస్‌కు తన స్నేహితురాళ్లతో కలిసి వెళ్లి పబ్‌లు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఎప్పటిలానే ఈసారి లాస్‌వేగాస్‌కు వెళ్లడానికి రెడీ అవుతున్నారట. అంతకు ముందుగా ఈ క్రేజీ బ్యూటీ తమిళ చిత్రం షూటింగ్ కోసం ఇటలీ వెళ్లాలి. ఈ నెలాఖరు ఖల్లా తిరిగి రానున్నారట. ఆ వెంటనే నూతన సంవత్సరం వేడుకలను లాస్‌వేగాస్‌లో జరుపుకోవడానికి బయలుదేరనున్నారని సమాచారం. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి అమలాపాల్ నూతన సంవత్సరాన్ని తన భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.
 
 దీని గురించి ఈ ముద్దుగుమ్మ తెలుపుతూ కేరళలో క్రిస్మస్ పండుగను జరుపుకుని నూతన సంవత్సర     వేడుకల్ని విజయ్‌తో కలిసి లాస్‌ఏంజిల్స్‌లో జరుపుకోనున్నట్లు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ పయనంలో కెనడా దేశాలు కూడా చుట్టి రానున్నట్లు తెలిపారు. అందువలన ఆ రోజు కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. మరికొందరు హీరోయిన్లు తమిళనాడుతోపాటు, ఇతర రాష్ట్రాలలోని స్టార్ హోటల్స్‌లో డాన్స్‌కు బేరసారాలు జరుపుకుంటున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement