31 జిల్లాల సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం | kcr inaugurates siddipet district, ministers and others follow | Sakshi
Sakshi News home page

31 జిల్లాల సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం

Published Tue, Oct 11 2016 11:28 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

31 జిల్లాల సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం - Sakshi

31 జిల్లాల సరికొత్త తెలంగాణ ఆవిష్కృతం

తెలంగాణలో సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు 10 జిల్లాలు మాత్రమే ఉన్న రాష్ట్రంలో సరికొత్తగా మరో 21 జిల్లాలు ఏర్పడ్డాయి. సిద్దిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆవిష్కరించారు. ఉదయం 10.25 గంటలకు బయల్దేరి, 11 గంటల సమయంలో సిద్దిపేట చేరుకున్న ఆయన.. అక్కడ కొత్తగా  ఏర్పాటుచేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటుచేసిన తాత్కాలిక కలెక్టరేట్‌నే కేసీఆర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.45 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మర్కూక్ మండల కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక కొత్తగా ఏర్పాటుచేసిన మిగిలిన 20 జిల్లాలను పలువురు మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement