
జయం రవితో లక్ష్మీమీనన్ రొమాన్స్
జయం రవి సరసన నటించిన అవకాశం రావడం పెద్దలకే. ఇంతకుముందు ఆయనకు జంటగా నటించిన వారందరూ ప్రముఖ హీరోయిన్లుగా వెలుగొందారు. తాజాగా నటి లక్ష్మీమీనన్ జయంరవితో రొమాన్స్‌కు సిద్ధం అయ్యారు. అయితే ఈమె ఇప్పటికే లక్కీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్నారు. అయితే హీరోయిన్‌గా చిన్న గ్యాప్ (చదువు కోసం) తీసుకుని నటిస్తున్న చిత్రం ఇదే. అజిత్ చిత్రంలో నటిస్తున్న అందులో లక్ష్మీమీనన్‌ది చెల్లెలి పాత్ర అన్నది గమనార్హం.
ఇంతకుముందు నాణయం, నాయ్‌గళ్ జాగ్రతై్త చిత్రాలను తెరకెక్కించిన శక్తి సౌందరరాజన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ ఈ వారంలో ఊటీలో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రం అధిక భాగం షూటింగ్ కొండ ప్రాంతాల్లోనే జరపనున్నారట. ఈ తరం యువత కోరుకునే అంశాలన్నీ చిత్రంలో ఉంటాయంటున్నారు చిత్ర వర్గాలు.