‘టీఆర్‌ఎస్‌ ఉచ్చులో కాంట్రాక్టు లెక్చరర్లు’ | malli ravi slams trs government over contract lecturers | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్‌ ఉచ్చులో కాంట్రాక్టు లెక్చరర్లు’

Published Fri, Feb 3 2017 1:51 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

‘టీఆర్‌ఎస్‌ ఉచ్చులో కాంట్రాక్టు లెక్చరర్లు’

‘టీఆర్‌ఎస్‌ ఉచ్చులో కాంట్రాక్టు లెక్చరర్లు’

హైదరాబాద్‌: కాంట్రాక్టు లెక్చరర్లు టీఆర్‌ఎస్‌ ఉచ్చులో పడ్డారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వారి క్రమబద్దీకరణకు విధివిధానాలు ఖరారు చేయలేదని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టామంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీ అమలుకు ఆ పార్టీ కార్యాలయాన్ని, సెక్రటేరియట్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ఫై బురద జల్లేందుకే ముఖ్యమంత్రి ఈ ఆందోళన చేయిస్తున్నారని, పోలీసులు దగ్గరుండి ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు.
 
కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనకు గతంలో కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారి బేసిక్ పే పెంచాలని డిమాండ్ చేస్తున్నామని పార్టీ నేత కత్తి వెంకటస్వామి అన్నారు. కేసుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కేసులు వేయలేదు.. వ్యక్తిగతంగా ఎవరైనా వేసివుంటే పార్టీ బాధ్యత కాదు అని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement