ముఖ్యమంత్రి మేనల్లుడికి రోడ్డు ప్రమాదం
కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ(29) మంగళవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హుగ్లీ జిల్లాలోని ముర్షిబాద్ లో పార్టీ మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రత్నపూర్ వద్ద ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ వే వద్ద బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం స్ధానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను కోల్ కతాలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం.