సీఎం మమతా బెనర్జీ సోదరుడు బబూన్ బెనర్జీ(ఫొటో కర్టెసీ: ట్విటర్)
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సోదరుడు బబూన్ బెనర్జీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కోల్‌కతాలోని చింగ్రిహటా ఈఎమ్ బైపాస్ సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు నిర్మల్ దత్తా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అదే విధంగా, ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇక బ్రేక్ ఫెయిల్ కావడంతోనే యాక్సిడెంట్ జరిగినట్లు డ్రైవర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ, బబూన్ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ర్యాలీలో ప్రసంగించిన మమతా బెనర్జీ ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment