ఆందోళనకరంగా సీఎం మేనల్లుడి ఆరోగ్యం | Abhishek Banerjee's health condition causes worry for docs | Sakshi
Sakshi News home page

ఆందోళనకరంగా సీఎం మేనల్లుడి ఆరోగ్యం

Published Sun, Oct 23 2016 4:02 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

ఆందోళనకరంగా సీఎం మేనల్లుడి ఆరోగ్యం - Sakshi

ఆందోళనకరంగా సీఎం మేనల్లుడి ఆరోగ్యం

కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారం రోజుల తర్వాత కూడా అభిషేక్ ఆరోగ్యం మెరుగుపడలేదు. అభిషేక్ చికిత్స పొందుతున్న బెల్లె వ్యూ క్లినిక్ ఆదివారం హెల్తె బులెటిన్ విడుదల చేసింది. ఆయన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని, ఇప్పటికీ కృత్రిమ శ్వాస అందిస్తున్నారని తెలిపారు. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో అభిషేక్ హృదయ స్పందన నిలకడగా లేకపోవడం వైద్యులకు ఆందోళన కలిగిస‍్తోంది. అభిషేక్ తలకు, ముఖంపై గాయాలయ్యాయి.

14 మందితో కూడిన వైద్యుల బృందం అభిషేక్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు త్వరలో సర్జరీ చేయనున్నారు. కాగా అభిషేక్కు నిర్వహించిన పరీక్షల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ బెనర్జీ (29) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హుగ్లీ జిల్లాలోని ముర్షిబాద్ లో పార్టీ మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రత్నపూర్ వద్ద ప్రమాదం జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement