పెళ్లికి నిరాకరించిందని.. | Man kills his lady love in delhi | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించిందని..

Published Sun, Aug 13 2017 12:11 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

పెళ్లికి నిరాకరించిందని.. - Sakshi

పెళ్లికి నిరాకరించిందని..

న్యూఢిల్లీః  దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించినందుకు స్నేహితురాలిని హతమార్చిన యువకుడి ఉదంతం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయం‍త్రం  టైలర్‌ వద్దకు వెళ్తానని ఇంట్లో చెప్పిన బాధిత యువతి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు టైలర్‌ను వాకబు చేయగా ఆమె తమ షాపుకు రాలేదని, ప్రదీప్‌ అనే యువకుడితో కనిపించిందని చెప్పారు. ప్రదీప్‌ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా యువతిని హత్య చేసి సమీపంలోని పొలంలో పడవేశానని అంగీకరించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడ మృతదేహాన్నికనుగొన్నారు. ఇరువురి ప్రేమను యువతి కుటుంబసభ్యులు అంగీకరించలేదని, దాంతో యువతి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఆమెను హతమార్చానని నిందితుడు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement