ప్రియురాలి ఫిర్యాదుతో ప్రియుడి వివాహం రద్దు | marriage stopped with the lover complaint | Sakshi
Sakshi News home page

ప్రియురాలి ఫిర్యాదుతో ప్రియుడి వివాహం రద్దు

Published Tue, Sep 5 2017 9:28 AM | Last Updated on Tue, Sep 12 2017 1:57 AM

marriage stopped with the lover complaint

తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రియుడి వివాహం ఆగిపోయింది. కోవై పోత్తనూర్‌ కోణవాయికాల్‌ పాళయానికి చెందిన విజయరాజ్‌ కుమారుడు సంతోష్‌(23). ఇతను ఐటీఐ చదివి మహారాష్ట్ర పూణెలో ఓ ప్రైవేటు సంస్థలో పని చేశాడు. ఇతను పని చేస్తున్న ప్రాంతంలో హోటల్‌ నడుపుతున్న శంకర్‌ కుమార్తె జాహ్నవి(19)తో పరిచయం ఏర్పడి ఇద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సంతోష్‌ కోవై సమీపం అరసూర్‌లో ఉన్న సర్ప్‌ సంస్థకు బదిలీ అయ్యాడు. అనంతరం ప్రియురాలితో సెల్‌ఫోన్‌లో మాట్లాడడం మానేశాడు. అయితే కోణవాయికాల్‌ పాళయంలో అభినయ ఇంటికి పక్కన సంతోష్‌ ఉంటున్నాడు. ఎంఎస్‌సీ చదవి ఉపాధ్యాయినిగా పని చేస్తోన్న అభినయకు సంతోష్‌కు సోమవారం ఉదయం వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సమాచారంతో సోమవారం ఉదయం కోవైకు చేరుకున్న జాహ్నవి  í అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వివాహాన్ని అడ్డుకున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement