ఎంసీడీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 272 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓటింగ్ మొదలైంది. 2012లో ఎంసీడీని ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించారు.
ఎంసీడీ ఎన్నికల్లో కోటి 30 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2500 మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఏర్పడింది. ఎంసీడీ ఎన్నికల్లో తొలిసారి ఓటర్లకు నోటా అవకాశాన్ని కల్పించారు. గత పదేళ్లుగా ఎంసీడీని బీజేపీ పాలిస్తోంది.
ఈ రోజు ఉదయమే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.