చిక్కబళ్లాపురం : కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల్లో తీవ్ర తాగునీటి సమస్య మరింత ముదిరి ఈ రెండు జిల్లాలు బీడు భూములుగా మారే అవకాశం ఉందని ఆది చుంచునగిరిమఠం పీఠాధ్యక్షుడు నిర్మలానంద స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి నగరంలోని ఒక్కళిగ కల్యాణమంటపంలో కేబీ.పిల్లప్ప స్మారకట్రస్ట్ ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఆయన ప్రతిభ పురస్కారాలు అందజేసి మాట్లాడారు.
రాష్ట్రంలో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందని, అయితే కోలారు జిల్లా వారే ఎక్కువ మంది కేఏఎస్ అధికారులుగా ఎంపిక అయ్యారని ఆయన గుర్తు చేశారు. సరిగా చదవకపోతే కరువు భూమిలో కష్టాలు పడాల్సి వస్తుందని విద్యార్థులకు సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించిన కేబీ పిళ్లప్పను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తాను చిక్కబళ్లాపురంలో ఆదిచుంచునగిరిమఠం స్థాపించే సందర్భంలో కొంత బాధపడ్డానని, తీరా ఇక్కడి ప్రజలు, భక్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనిదన్నారు.
అనంతరం ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు స్వామీజీ అందజేశారు. కార్యక్రమంలో చిక్కబళ్లాపురం ఆదిచుంచునగిరి శాఖ మఠం అధ్యక్షుడు సిద్దేశ్వననాథ స్వామీజీ, మంగళానందస్వామీజీ ఆదిచుంచునగిరి విద్యాట్రస్ట్ ప్రధాన పాలనాధికారి విశ్రాంత చాన్సలర్ డాక్టర్ ఎస్.రామేగౌడ, మాజీ ఎమ్మెల్యే కేపీ బచ్చేగౌడ తదితరులు పాల్గొన్నారు.
‘మధ్యంతరం’ తప్పదు
Published Mon, Aug 4 2014 3:07 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement