‘ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టులు’
‘ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టులు’
Published Wed, Nov 2 2016 4:09 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
వరంగల్: హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో రూ.5 వేల కోట్లతో గ్రేటర్ వరంగల్ అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్, ఓరుగల్లు కారిడార్ లో పరిశ్రమల స్థాపనకు కృషి చేయనున్నట్టు తెలిపారు. జిల్లాకు చెందిన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ తప్పక న్యాయం చేస్తారని ఆయన తెలిపారు. త్వరలో మరోసారి చేపట్టబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికి సముచిత స్థానం కల్పిస్తారని భరోసా ఇచ్చారు. టెక్స్ టైల్ పార్క్ వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. బుధవారం కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌గా మర్రి యాదవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, వరంగల్ మేయర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement