దొంగను దొంగా అనక ఏమంటారు? | mla-vamshi-chand-reddy-slams-minister-jupally-krishna-rao | Sakshi
Sakshi News home page

దొంగను దొంగా అనక ఏమంటారు?

Published Thu, Feb 16 2017 2:34 PM | Last Updated on Tue, Oct 30 2018 5:28 PM

దొంగను దొంగా అనక ఏమంటారు? - Sakshi

దొంగను దొంగా అనక ఏమంటారు?

హైదరాబాద్‌: దేవుడి మాన్యాన్ని దోచుకున్నోడిని మోసగాడు కాక మరేమంటారు.. బ్యాంకులను ఎగ్గొట్టిన వాడిని 420 కాక మరేమంటారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి పంప్‌హౌస్‌ డిజైన్‌ మార్పు వెనక జూపల్లి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. నా ప్రశ్నలకు జూపల్లి దగ్గర సమాధానం లేకే తోక ముడిచారన్నారు. తాను జూపల్లికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని.. దొంగను దొంగ అనక ఏమంటారని ప్రశ్నించారు.
 
దొంగ దారిన కాలేజీలు పెట్టి, పేద విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజు దోచుకుంటున్న కసిరెడ్డి నారాయణ రెడ్డితో నాకు పోలికా.. అని ఎద్దేవ చేశారు. జూపల్లి కి లగడపాటి మధ్య ఏదో రహస్య ఒప్పందం కుదిరిందని.. లేకపోతే తెలంగాణ ప్రభుత్వం లగడపాటి కబ్జా భూమిని ఎందుకు స్వాదీనం చేసుకోవట్లదేని ప్రశ్నించారు. ఒక్కరు ఒక్కరుగా కాదు.. అందరు ఓకే సారి వచ్చినా సరే.. సింహం సింగిల్ గా వస్తది.. పందులు గంపులుగా వస్తాయి. ఎంత మంది వస్తారో రండి.. వాస్తవాలు నిరూపించేందుకు నేను రెడీ అని ఆవేశపూరితంగా ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement