minister jupalli krishna rao
-
పట్టు ఉత్పత్తిలో చైనాతో పోటీపడదాం
సాక్షి, హైదరాబాద్: పట్టు ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమలో చైనాతో పోటీపడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పట్టు రైతుల అవగాహన సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో పట్టు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటే, భారత్ వెనకబడి రెండోస్థానంలో నిలిచిందన్నారు. అమెరికా, ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్‌లతో పాటు భారత్ కూడా పట్టును దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. పట్టు ఉత్పత్తులకు మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందన్నారు. ఐదో స్థానంలో తెలంగాణ.. సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే మల్బరీ సాగు వైపు కూడా రైతులు దృష్టిని సారించాలని జూపల్లి సూచించారు. భారత్‌లో 45 వేల మెట్రిక్ టన్నుల పట్టుకు డిమాండ్ ఉంటే 31వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. గతేడాది లెక్కల ప్రకారం దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల పట్టును చైనా నుండి దిగుమతి చేసుకున్నామన్నారు. మనదేశంలో 9,571 మెట్రిక్ టన్నుల పట్టు ఉత్పత్తితో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే 119 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణలో మల్బరీ సాగు, పట్టు గూళ్ల ఉత్పత్తితో రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎకరం సాగుతో ఏడాదికి రూ.4 లక్షలు ఒక ఎకరం మల్బరీ సాగు చేయడం వల్ల ఐదుగురికి ఏడాదంతా ఉపాధి కల్పించవచ్చునని, ఏడాదిలో 8 నుండి 10 పంటలు సాగు చేయవచ్చునని జూపల్లి చెప్పారు. ఎకరానికి దాదాపుగా రూ.4 లక్షల ఆదాయాన్ని ఏడాదిలో ఆర్జించే అవకాశముందని వివరించారు. వాతావరణ పరిస్థితులు, ఇతర సమస్యలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 70 శాతం రాయితీ ఇస్తూ మల్బరీ షెడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఉద్యానవన శాఖ కూడా మిగిలిన 30 శాతాన్ని రాయితీగా ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా పట్టు దారం–రైతు జీవనాధారం బుక్లెట్, సీడీని జూపల్లి ఆవిష్కరించారు. -
రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షం
పాన్‌గల్ (వనపర్తి) : రైతు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు అని, రైతులు బాగుంటేనే సకల జనులు సంతోషంగా ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంతోపాటు శా గాపూర్, వెంగళాయిపల్లి గ్రామాల్లో రైతులకు పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కావడంతో రైతు సంక్షేమమే ధ్యే యంగా వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయ ం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పెట్టుబడి సాయానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పంటల సాగు సమయంలో పె ట్టుబడి, ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారులు, ఇతరుల దగ్గరికి వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. దీంతోపాటు జూన్ 2వ తేదీ నుంచి రైతులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామన్నారు. 70 ఏళ్లలో చేయనటువంటి ఎన్నో అభివృద్ధి పథకాల ను సీఎం కేసీఆర్ నాలుగేళ్లలో అమలు చేశారని కొనియాడారు. ప్రభుత్వం ఇప్పటికే రైతులకు నా ణ్యమైన నిరంతర విద్యుత్, సాగునీరు అందిస్తుందని, త్వరలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. లక్ష మొక్కలు పెంచాలి.. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ద్వారా లక్ష మొక్కలు పెంచాలని జూపల్లి కృష్ణారావు పిలుపుని చ్చారు. ప్రతి ఇల్లు, గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను వీధుల్లో వేసే వారికి జీపీ ద్వారా జరిమానా విధించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా, వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం, హ రితహారం ద్వారా మొక్కల పెంపకం వంటి పనులకు పంచాయతీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయా పనులపై అలసత్వం వహించే పం చాయతీలపై చర్యలు తీసుకునేలా నూతన పం చాయతీ చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి పే ర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని శా గాపూర్ గ్రామానికి వచ్చిన మంత్రి జూపల్లికి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ప్రత్యేకంగా అలకరించిన ఎద్దుల బండిపై మంత్రి పురవీధుల గుండా ప్రయాణిస్తూ చె క్కుల పంపిణీ సమావేశం దగ్గరికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జె డ్పీటీసీ రవికుమార్, విండో చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ భాస్కర్‌యాదవ్, ఆర్డీఓ చంద్రారెడ్డి, జిల్లా రైతు సంఘం సభ్యులు తిరుపతయ్యసాగర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ బాలరాజుయాదవ్, ఆ యా గ్రామాల సర్పంచ్‌లు సాలమ్మ, సురేఖ, మం జుల, ఎంపీటీసీ సభ్యుడు సింగన్న, రామచందర్‌యాదవ్, రామచందర్, తహసీల్దార్ అలెగ్జాండర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్‌సాగర్, నాయకులు పాల్గొన్నారు. -
దసరాలోపు ఉపాధి హామీ వేతనాలు
► గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకంకింద కూలీ లకు వేతన బకాయిలను దసరా లోపు చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం ఇక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జిత్ సిన్హాతో భేటీ అయిన అనం తరం కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. నరేగా కింద కేంద్రం ఇవ్వాల్సిన రూ.250 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కార్యదర్శిని కోరినట్టు తెలిపారు. కేంద్రం నిధులు విడుదల చేయనం దున వేతనాలు చెల్లించడం ఇబ్బందిగా మారిందని వివరించారు. బకా యిల్లో రూ.200 కోట్లను తక్షణం విడుదల చేసేందుకు చర్యలు తీసు కుంటున్నట్టు కార్యదర్శి చెప్పారని మంత్రి వివరించారు. అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ నగేష్సింగ్తోనూ జూపల్లి భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగను దొంగా అనక ఏమంటారు?
హైదరాబాద్: దేవుడి మాన్యాన్ని దోచుకున్నోడిని మోసగాడు కాక మరేమంటారు.. బ్యాంకులను ఎగ్గొట్టిన వాడిని 420 కాక మరేమంటారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి పంప్‌హౌస్ డిజైన్ మార్పు వెనక జూపల్లి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. నా ప్రశ్నలకు జూపల్లి దగ్గర సమాధానం లేకే తోక ముడిచారన్నారు. తాను జూపల్లికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని.. దొంగను దొంగ అనక ఏమంటారని ప్రశ్నించారు. దొంగ దారిన కాలేజీలు పెట్టి, పేద విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజు దోచుకుంటున్న కసిరెడ్డి నారాయణ రెడ్డితో నాకు పోలికా.. అని ఎద్దేవ చేశారు. జూపల్లి కి లగడపాటి మధ్య ఏదో రహస్య ఒప్పందం కుదిరిందని.. లేకపోతే తెలంగాణ ప్రభుత్వం లగడపాటి కబ్జా భూమిని ఎందుకు స్వాదీనం చేసుకోవట్లదేని ప్రశ్నించారు. ఒక్కరు ఒక్కరుగా కాదు.. అందరు ఓకే సారి వచ్చినా సరే.. సింహం సింగిల్ గా వస్తది.. పందులు గంపులుగా వస్తాయి. ఎంత మంది వస్తారో రండి.. వాస్తవాలు నిరూపించేందుకు నేను రెడీ అని ఆవేశపూరితంగా ప్రసంగించారు. -
‘ఆ మంత్రిది 420 చరిత్ర’
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావుపై కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి విరుచుకుపడ్డారు. జూపల్లి సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. జూపల్లి చరిత్ర తెలిస్తే తెలంగాణ ప్రజలు ఆయన్నుఅసహ్యించుకుంటారన్నారు. లూటీలు.. నేరాలు.. ఫోర్ ట్వంటీ.. చరిత్ర జూపల్లిది అని విమర్శించారు. దేవుని మాన్యాన్ని కాజేసిన దగుల్బాజీ జూపల్లి అని ఘాటుగా విమర్శలు సంధించారు. బ్యాంకు లూటీ అంశంలో స్వంత గ్రామంలో ప్రజలు తరిమికొడితే పారిపోయి హైదరాబాద్‌కు వచ్చిన చరిత్ర, ప్రుడెన్షియల్ బ్యాంకు ముంచిన చరిత్ర జూపల్లిదన్నారు. హైదరాబాద్ లో తనకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని హుసేన్ సాగర్‌లో తోసి చంపిన ఆరోపణలు జూపల్లిపై వున్నాయన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రా .. అని సవాల్ విసిరారు. ఖబర్దార్ జూపల్లి మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు. గతంలో కేఎల్ఐ కాల్వలను వెడల్పు తగ్గించి కాంట్రాక్టర్ల వద్ద లంచాలు దండుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ పాలమూరు కాల్వలను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. నీతితో కూడిన రాజకీయాలు నావి .. నీతిమాలిన రాజకీయాలు జూపల్లివి అని అన్నారు. తన జీవితం కాంగ్రెస్‌తో మొదలైందని.. కాంగ్రెస్ లోనే అంతమౌతుందన్నారు. -
'పన్నుమదింపు సరిగా లేదు'
మేడ్చల్ రూరల్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను ఇటీవలే చేపట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయి పర్యటనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట గ్రామాన్ని శనివారం సందర్శించారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లి బిల్ కలెక్టర్, సెక్రటరీలను అడిగి పన్ను వసూళ్లు, ఆదాయ వనరుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామ పంచాయతీలు తమ పరిధిలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. పంచాయతీ కార్యాలయాల్లో పన్ను మదింపు సరిగా జరగడం లేదని అభిప్రాయపడ్డారు.