దసరాలోపు ఉపాధి హామీ వేతనాలు
► గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకంకింద కూలీ లకు వేతన బకాయిలను దసరా లోపు చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం ఇక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్‌జిత్ సిన్హాతో భేటీ అయిన అనం తరం కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. నరేగా కింద కేంద్రం ఇవ్వాల్సిన రూ.250 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కార్యదర్శిని కోరినట్టు తెలిపారు.
కేంద్రం నిధులు విడుదల చేయనం దున వేతనాలు చెల్లించడం ఇబ్బందిగా మారిందని వివరించారు. బకా యిల్లో రూ.200 కోట్లను తక్షణం విడుదల చేసేందుకు చర్యలు తీసు కుంటున్నట్టు కార్యదర్శి చెప్పారని మంత్రి వివరించారు. అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ నగేష్‌సింగ్‌తోనూ జూపల్లి భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ తదితరులు పాల్గొన్నారు.