పాన్‌గల్ : మహిళా రైతుకు రైతుబంధు చెక్కు అందజేస్తున్న మంత్రి జూపల్లి
పాన్‌గల్ (వనపర్తి) : రైతు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు అని, రైతులు బాగుంటేనే సకల జనులు సంతోషంగా ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంతోపాటు శా గాపూర్, వెంగళాయిపల్లి గ్రామాల్లో రైతులకు పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఉన్నంత వరకు రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కావడంతో రైతు సంక్షేమమే ధ్యే యంగా వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనటువంటి ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయ ం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పెట్టుబడి సాయానికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పంటల సాగు సమయంలో పె ట్టుబడి, ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారులు, ఇతరుల దగ్గరికి వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. దీంతోపాటు జూన్ 2వ తేదీ నుంచి రైతులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామన్నారు. 70 ఏళ్లలో చేయనటువంటి ఎన్నో అభివృద్ధి పథకాల ను సీఎం కేసీఆర్ నాలుగేళ్లలో అమలు చేశారని కొనియాడారు. ప్రభుత్వం ఇప్పటికే రైతులకు నా ణ్యమైన నిరంతర విద్యుత్, సాగునీరు అందిస్తుందని, త్వరలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.
లక్ష మొక్కలు పెంచాలి..
ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ద్వారా లక్ష మొక్కలు పెంచాలని జూపల్లి కృష్ణారావు పిలుపుని చ్చారు. ప్రతి ఇల్లు, గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను వీధుల్లో వేసే వారికి జీపీ ద్వారా జరిమానా విధించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా, వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం, హ రితహారం ద్వారా మొక్కల పెంపకం వంటి పనులకు పంచాయతీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయా పనులపై అలసత్వం వహించే పం చాయతీలపై చర్యలు తీసుకునేలా నూతన పం చాయతీ చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి పే ర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని శా గాపూర్ గ్రామానికి వచ్చిన మంత్రి జూపల్లికి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.
గ్రామంలో ప్రత్యేకంగా అలకరించిన ఎద్దుల బండిపై మంత్రి పురవీధుల గుండా ప్రయాణిస్తూ చె క్కుల పంపిణీ సమావేశం దగ్గరికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జె డ్పీటీసీ రవికుమార్, విండో చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ భాస్కర్‌యాదవ్, ఆర్డీఓ చంద్రారెడ్డి, జిల్లా రైతు సంఘం సభ్యులు తిరుపతయ్యసాగర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ బాలరాజుయాదవ్, ఆ యా గ్రామాల సర్పంచ్‌లు సాలమ్మ, సురేఖ, మం జుల, ఎంపీటీసీ సభ్యుడు సింగన్న, రామచందర్‌యాదవ్, రామచందర్, తహసీల్దార్ అలెగ్జాండర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్‌సాగర్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment