కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఎంపీ.అనంతకుమార్
బనశంకరి,న్యూస్‌లైన్ :
బెంగళూరు మహానగర సమగ్రాభివృద్ధి కోసంబీబీఎంపీకి రూ.10 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగళూరు దక్షిణ ఎంపీ.అనంతకుమార్ డివ ూండ్ చేశారు. మంగళవారం పద్మనాభనగర విధానసభ నియోజకవర్గం పరిధిలోని యడియూరు వార్డు సౌత్ ఎండ్ సర్కిల్ వద్ద రూ.8 కోట్ల నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు అన ంతకుమార్ భూమిపూజ నిర్వహించి మాట్లాడారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నందున బీబీఎంపీకి నిధులు విడుదల చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తారతమ్యం చూపిస్తున్నాయని ఆరోపించారు. బీబీఎంపీకి జరుగుతున్న అన్యాయంపై శీతాకాల పార్లమెంటు సవ ూవేశాల్లో ప్రస్తావిస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ టికెట్లు కేటాయింపులో పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, అర్హులైన వారికే పార్టీ టికెట్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పకు పార్టీలో ఉన్నత స్థానం ఇచ్చే విషయం పార్టీ అధినాయకత్వానికి వదిపెట్టామన్నారు. ఢిల్లీ వ ుుఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ పరిపక్వత సాధించలేని వ్యక్తి అని అనంతకుమార్ అన్నారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్తిరపరచడానికి బీజేపీ నేతలు రూ.20 కోట్లు సుపారి ఇచ్చారన్న కేజ్రీవాల్ ఆరోపణలపై అతను ఒక మతిస్థిమితం లేని వ్యక్తిగా అభివర్ణించారు అనంతకుమార్. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్ మాట్లాడుతూ... బీఎస్ .యడ్యూరప్ప సముచితస్థానం అందించాలని రాష్ర ్టబీజేపీ శాఖ పార్టీ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసిందన్నారు. బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజవర్గం నుంచి పార్టీ టికెట్ అందించాలని ఎవరిని తాను అడగలేదని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానంటూ పరోక్షంగా మాజీ సీఎం సదానందగౌడను ఉద్దేశించి అన్నారు. పార్టీలో అందరూ సమిష్టిగా కృషి చేసి లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలవాలన్నదే తమ ఆశయమన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎన్‌ఆర్.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహానగర పాలికేకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి
Published Wed, Feb 5 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement