yaddyurappa
-
కర్ణాటక కొత్త సీఎం ఎంపిక పై బీజేపీ హైకమాండ్ కసరత్తు
-
కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా
-
సీఎం యడియూరప్పకు అగ్నిపరీక్ష
సాక్షి, బెంగళూరు: కొత్త ఏడాదిలో తొలిసారి శాసనసభ సమావేశాలు నేడు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ వరకు వారంపాటు జరుగుతాయి. తొలిరోజు గవర్నర్ వజూభాయ్‌వాలా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించి సభాపర్వానికి శ్రీకారం చుడతారు. సీఎం ముందున్న ఇబ్బందులు సీఎం యడియూరప్పకు ఈ సమావేశాలు సవాల్ అనే చెప్పాలి. మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుతో అసంతృప్తికి గురైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు యడియూరప్పపై బహిరంగ విమర్శకు దిగారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. పెన్షన్లు సహా అనేక సంక్షేమ పథకాలు నత్తనడకన నడుస్తున్నాయని విమర్శలున్నాయి. రైతుల సమస్యలు, రాబోయే వేసవికాలంలో తాగునీరు, విద్యుత్ కొరత, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తదితరాలు అసెంబ్లీలో వేడెక్కించే అవకాశముంది. ఖాళీగా ఉన్న విధానపరిషత్ ఉప సభాపతి పీఠం ఎవరిదనేది ఉత్కంఠగా మారింది. బుధవారం సీఎం యడియూరప్పతో జేడీఎస్ నేత బసవరాజు హొరట్టి భేటీ అయి దీనిపై చర్చించారు. సౌధ వద్ద నిషేధాజ్ఞలు శివాజీనగర: శాసనసభా సమావేశాల నేపథ్యంలో విధానసౌధ చుట్టుపక్కల ముందు జాగ్రత్తగా నిషేధాజ్ఞలను విధించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విధానసౌధ చుట్టూ ఫిబ్రవరి 5 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. -
‘కర్ణాటకానికి’ తెర!
అనుకున్నట్టే కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైననాటి నుంచీ సంచలనాలకు కేంద్రంగా ఉన్న స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూశాక అందరికీ ఒకటి మాత్రం అర్ధమైంది– ప్రభుత్వం సంఖ్యాపరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చే విశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ ఎడతెగని సీరియల్లా రోజుల తరబడి సాగుతాయి. తగినంత బలం ఉందనుకున్నప్పుడు పెట్టే తీర్మానం ఆగమేఘాల మీద పూర్తవుతుంది. రాజీనామాలిచ్చి మహారాష్ట్ర తరలిపోయి మకాం వేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు 17మంది విప్ విషయంలో తానిచ్చిన నోటీసులకు జవాబివ్వలేదన్న కారణం చూపి స్పీకర్ వారిపై అనర్హత వేటు వేసిన పర్యవసానంగా బల నిరూపణకు అవసరమైన కనీస సంఖ్యాబలం 104కు తగ్గింది. సొంత బలం 105కు తోడు అదనంగా స్వతంత్ర సభ్యుడి ఆసరా తీసుకుని యడియూరప్ప గట్టెక్కారు. ఎంతకాలం అధికారంలో కొనసాగుతారన్న అంశాన్ని పక్కనబెడితే త్రుటిలో చేజారిన సీఎం పదవిని చేజిక్కించుకు తీరాలన్న ఆయన పట్టుదల నెరవేరింది. కర్ణాటకలో నిరుడు మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా... గవర్నర్ వజూభాయ్ వాలా తొలి అవకాశమిచ్చినా ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. చివరకు కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. గత 14 నెలలుగా యడియూరప్ప అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల్లో కొందరిని సమీకరించుకోవడానికి కృషి చేస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడమే కాదు...సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోన్ సంభాషణల ఫైళ్లు కూడా వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం మాత్రం అంతర్గత కుమ్ములాటలతో కాలం గడిపింది. కుమారస్వామికి సక్రమంగా పాలించడానికి అవకాశమే చిక్కలేదు. 17మంది ఎమ్మెల్యేలు వలసపోవడానికి బీజేపీ ఏం చేసిందన్న సంగతలా ఉంచితే నిరంతర కలహాలతో మునిగితేలే కూటమి నుంచి నిష్క్రమించడానికి ఆ ఎమ్మెల్యేలకు సాకు దొరికిందన్నది వాస్తవం. ఈ మొత్తం వ్యవహారంలో రమేశ్ కుమార్ పాత్ర గురించి చెప్పుకోవాలి. ఆ పదవి హుందాతనాన్ని నిలబెట్టడంలో, పార్టీలకు అతీతంగా పనిచేయడంలో అసెంబ్లీల మొదలుకొని పార్లమెంటు వరకూ సభాధ్యక్షులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వర్తమానంలో ఆయన ప్రశంశనీయంగా వ్యవహరించారు. కూటమి తరఫున స్పీకర్ పదవిని అధిష్టించినా చాలా వరకూ తటస్థంగా ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఒకపక్క, విశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఫలానా సమయానికల్లా పూర్తికావాలన్న గవర్నర్ తాఖీదులు మరోపక్క వచ్చినా తన విధుల విషయంలో ఆయన స్పష్టంగానే, నిష్కర్షగానే ఉన్నారు. ఒత్తిళ్లకు లొంగడానికి సిద్ధపడలేదు. విశ్వాస తీర్మానంపై జరిగే చర్చను మరింత పొడిగించాలని అప్పటికి సీఎంగా ఉన్న కుమారస్వామి కోరినా నిరాకరించారు. ఓటింగ్‌ను ఎలాగైనా ఇంకోరోజుకు వాయిదా వేస్తే ఏదో ఒరుగుతుందన్న భ్రమలో ఉన్న కుమారస్వామికి చివరకు నిరాశే మిగిల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నప్పుడు ఆనాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు, గత అయిదేళ్లలో కోడెల శివప్రసాదరావు ఎలా వ్యవహరించారో, ఆ పదవికే ఎలా కళంకం తెచ్చారో తెలుగు ప్రజలు మరిచిపోలేరు. పదవి నుంచి వైదొలగక తప్పనిస్థితి ఏర్పడిన ఒక ముఖ్యమంత్రి అందుకు గల కారణాలను చెప్పుకుందామంటే రామకృష్ణుడు ఆయనకు అవకాశమివ్వలేదు. ఏ పరిస్థితుల్లో తాను పదవి కోల్పోవలసి వచ్చిందో ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన వీడియోలు సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఇప్పుడు అందరికీ అందుబాటులోకొచ్చాయి. కానీ యనమల అనుసరించిన వైఖరి కారణంగా అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం ఆయన స్వరం లేదు. కోడెల తీరు కూడా ఎన్నో విమర్శలకు తావిచ్చింది. సభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఎంతో ఆయనకు తెలుసు. అందులో ఎందరు ఫిరాయించారో తెలుసు. ఎందరికి మంత్రి పదవులొచ్చాయో తెలుసు. కానీ స్పీకర్‌గా అలాంటి సభ్యులపై చర్య తీసుకోవడం తన బాధ్యతన్న సంగతిని మాత్రం మరిచారు. కానీ సభలోనూ, బయట వేదికలపైనా విలువల గురించి గంభీరోపన్యాసాలివ్వడం మానుకోలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు... ఒక సందర్భంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఈ బాపతు నేతలే స్పీకర్లుగా అధికారాలు చలాయిస్తున్న దేశంలో ఫిరాయింపుల నిషేధ చట్టంతోసహా అన్ని రకాల రాజ్యాంగ విలువలూ మంట కలవడంలో వింతేముంది? ఇలాంటి పరిస్థితుల్లో రమేశ్ కుమార్ సభా సంప్రదాయాలనూ, స్పీకర్‌గా తనకున్న అధికారాలను సవ్యంగా వినియోగించుకోలగడం ప్రశంసనీయం. రాజకీయ వ్యూహప్రతివ్యూహాల దశ ముగిసింది కనుక కర్ణాటక ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఏం చేయాలన్న విషయంపై కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సాగు సంక్షోభం, ఉపాధి లేమి గ్రామీణ ప్రాంతాలను ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొత్త ప్రభుత్వం తక్షణ చర్యలకు నడుం బిగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే యడియూరప్ప అధికారంలో ఎన్నాళ్లు నెట్టుకు రాగలరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పదవి కోసం కూటమి సర్కారును కూల్చిన ఎమ్మెల్యేల వైనం కళ్ల ముందు కనబడుతుండగా, బీజేపీలో పదవు లాశిస్తున్నవారు సైతం రేపన్న రోజున అదే పని చేయరన్న గ్యారెంటీ లేదు. అదీగాక 17 స్థానాలకూ ఉప ఎన్నికలు వస్తే యడియూరప్పకు అదొక అగ్ని పరీక్ష అవుతుంది. వీటిని ఆయన ఎలా అధిగమిస్తారో, ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచి చూడాలి. -
రాయని డైరీ : యడియూరప్ప
సీఎం సీట్లో కూర్చున్నాను. కొత్తగా ఏం లేదు. కామన్ థింగ్‌లా ఉంది. ఇది నాలుగోసారి కూర్చోవడం. మూడుసార్లు కూర్చొని లేవడంతో నాలుగోసారి అయింది కానీ, మూడైదులు పదిహేనేళ్లు పూర్తయినందుకు నాలుగోసారి కాలేదు. శుక్రవారమే ప్రమాణ స్వీకారం అయింది. సీఎం సీట్లో కూర్చోవడం నాకు కామన్ థింగే అయినా, మూడు రోజులపాటైనా సిఎంగా ఉండడం అన్ కామన్‌థింగ్. రేపు సోమవారం బల నిరూపణ. నిరూపణలో నిలబడగలిగితే మళ్లీ పడిపోయేలోపు మరికొన్ని రోజులో, నెలలో కూర్చోడానికి ఉంటుంది. కుర్చీ కదలకుండా ఉండాలంటే నూట పన్నెండుమంది వచ్చి గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోడానికి ఇప్పటికి నూటా ఆరుమంది ఉన్నారు. మరో ఆరుగురు దొరకాలి. కుర్చీలనైతే పట్టుకురావచ్చు. కుర్చీని కదలకుండా పట్టుకునే వాళ్లను ఎక్కడి నుంచి పట్టుకురావాలి?! ‘మీరెవరూ ఇందులో కదలకుండా కూర్చోలేరు కానీ, నాకు పంపించేయండి యాంటిక్ పీస్‌గా రాష్ట్రపతి భవన్లో ఓ ఆర్నెల్లు ఉంచుకుంటాను’ అని రామ్‌నాథ్ కోవింద్ అడిగినా ఇచ్చేయడం తప్ప చేయగలిగిందేమీ లేదు. బీజేపీకి కుర్చీ నిలబడడం ముఖ్యం. అందులో యడ్యూరప్ప కూర్చున్నాడా, యడియూరప్ప అని పేరు మార్చుకుని కూర్చున్నాడా అక్కర్లేదు. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసి వస్తుంటే వాజూభాయ్ చెయ్యిపట్టి ఆపారు. ‘‘తొందరేం లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడే మీ బలాన్ని నిరూపించుకోండి’’ అన్నారు. బల నిరూపణ ఎంత ఆలస్యం అయితే అన్ని రోజులు íసీఎంగా ఉండొచ్చన్నదే ఆయన మాటల్లోని అంతరార్థం కనుకైతే ఐదోసారి కూడా నేను íసీఎం సీట్లో కూర్చోవలసి రావచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారని అనుకోవాలి. ‘‘తొందరేం లేదు కానీ, ఆలస్యం మాత్రం ఎందుకు వాజూభాయ్. సోమవారమే నిరూపించుకుంటాను’’ అన్నాను. ‘‘పోనీ జూలై ముప్పై ఒకటి వరకైనా టైమ్ తీసుకోండి..’’ అన్నారు ఆపేక్షగా! మెజారిటీ నిరూపించుకొమ్మని కుమారస్వామికి ఒకే రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. మూడు డెడ్లైన్లను విధించి తొందరపెట్టిన వాజూభాయ్‌కి.. మెజారిటీ నిరూపించడానికి తొందరేమిటని నాతో అంటున్న వాజూభాయ్‌కి ఎంత తేడా! ప్రమాణ స్వీకారం అయ్యాక ఢిల్లీ నుంచి నాకు ఫోన్ వస్తుందనుకున్నాను. రాలేదు! ‘సోమవారమే అంటే ఎట్లా? అంత తొందరగా!’ అని ఎవరైనా ఫోన్ చేసి అడుగుతారనుకున్నాను. అడగలేదు! సీఎంగా కుమారస్వామి రాజీనామా చేసినప్పుడు కూడా అంతే. మంగళవారం రాత్రి ఆయన కుర్చీలోంచి దిగిపోతే బుధవారం, గురువారం మౌనంగా ఉండి, శుక్రవారం ఉదయం నాకు ఫోన్ చేశారు అమిత్‌షా.. ‘మీరెళ్లి ఆ కుర్చీలో కూర్చోండి’ అని. ఇప్పుడూ ఏదో ప్లాన్ చేసే ఉంటారు. చేయకపోయినా, నేను అమిత్‌షాకు ఫోన్ చేసి అడగడానికి ఏమీ లేదు. కర్ణాటకలో నాతో పాటు ఇంకో యడియూరప్ప ఉండి, ఆ యడియూరప్ప కూడా బీజేపీలోనే ఉండి, ఆ యడియూరప్ప నాలా డెబ్బై ఆరేళ్ల వయసులో కాకుండా, పాతికేళ్ల వయసులో ఉన్నా కూడా అమిత్‌షా నన్ను కాదనుకుని అతడిని తీసుకుంటాడని అనుకోను. బీజేపీలో డెబ్బై ఐదేళ్లు దాటితే రిటైర్మెంట్. ఐదేళ్ల తర్వాత మోదీ మూడోసారి కూడా ప్రధాని అయి, డెబ్బై ఐదేళ్ల వయసు తర్వాత కూడా ఆయన ప్రధానిగా కొనసాగాలంటే డెబ్బై ఆరేళ్లున్న నన్ను ఇప్పుడు ఒక రిఫరెన్స్‌గా అమిత్‌షా నిలబెట్టాలి. అందుకోసం అమిత్‌షా ఏమైనా చెయ్యాలి. బల నిరూపణ సోమవారమే అయినా, వారం తర్వాతే అయినా. -
కన్నడ కురువృద్ధుడి మాట నెగ్గేనా?
పరిమాణం రీత్యా దేశంలోని మధ్య స్థాయి రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక ఇంతవరకు తిరుగులేని అధికారం చలాయిస్తున్న అమిత్ షా, నరేంద్రమోదీలకు తొలి సవాలు విసిరింది. బీజేపీ చరిత్రలో ఏ ఒక్కరికీ సాధ్యపడని రీతిలో ఆ పార్టీ అధిష్టానాన్నే రాజీపడేలా చేశారు యడియూరప్ప. ముఖ్యంగా బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు ఏ ముఖ్యపదవులూ చేపట్టరాదనే వయోపరిమితి నిబంధనను యడియూరప్ప ధిక్కరించారు. అవినీతి విషయంలో ఎవరినీ మినహాయించేది లేదంటూ బీజేపీ నిర్దేశించుకున్న మరో ముఖ్య సూత్రాన్ని కూడా వదులుకునేలా చేశారు. అవినీతి ఆరోపణలతో గతంలో సీఎం పదవికి రాజీనామా చేసి పోటీ పార్టీ పెట్టిన తాను మినహా పార్టీకి మరో దిక్కులేదని ఆయన నిరూపించుకున్నారు. ఇది మిగతా రాష్ట్రాల్లోని బీజేపీ సీనియర్ నేతలకు కూడా ప్రేరణ నిస్తుందా అనేది ప్రశ్న. కర్ణాటక రాజకీయపరంగా చూస్తే భారతదేశంలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రమయితే కాదు. లోక్‌సభకు అది అందిస్తున్న ఎంపీల సంఖ్య ప్రాతిపదికన చూస్తే కేరళ (2), మధ్యప్రదేశ్ (29)కి మధ్య స్థాయిలో ఉండే రాష్ట్రమది. కానీ గత కొన్ని నెలలుగా పతాక శీర్షికల్లో లభించే ప్రాధాన్యతను బట్టి చూస్తే కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలను చాలాసార్లు అధిగమించినట్లే చెప్పాలి. ఇప్పుడు బీజేపీ కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరుణంలో రాష్ట్రం ప్రశాంతంగా విజయ సంబరాలను గడుపుకుంటుదని మనం ఊహించవచ్చు కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే చాలా కలవరం, వ్యాకులత కలుగుతోంది. మరింత వివరంగా చెప్పాలంటే.. పరిమాణం రీత్యా దేశంలోని మధ్య స్థాయి రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక ఇంతవరకు తిరుగులేని అధికారం చలాయిస్తున్న అమిత్ షా, నరేంద్రమోదీలకు తొలి సవాలు విసిరింది. మనం మరింత స్పష్టత కోసం చూద్దాం. ఈ ఘనతకు కారణం ఆ రాష్ట్రం కాదు.. తన సొంత పార్టీలో ఊహించలేనంత అధికార కుట్రను ముందుకు తీసుకువచ్చిన బీఎస్ యడియూరప్పకే మొత్తం ఘనత దక్కుతుంది. బీజేపీ చరిత్రలో ఏ ఒక్కరికీ సాధ్యపడని రీతిలో ఈ వ్యక్తిమాత్రుడు ఆ పార్టీ అధిష్టానాన్నే రాజీపడేలా చేశాడు. వయోపరిమితి నిబంధనకు చెక్ బీజేపీలో 75 సంవత్సరాలు నిండిన వారు ఏ ముఖ్యపదవులూ చేపట్టరాదనే వయోపరిమితి నిబంధనను యడియూరప్ప ధిక్కరించారు. ఇప్పుడాయనకు 76 ఏళ్లు. ఆ వయసులో ఉన్న పార్టీ నేతలు ఎవరైనా సరే గవర్నరుగా రాజ్భవన్కో లేక పార్టీ మార్గదర్శక మండలికో వెళ్లాల్సి ఉంటుందని మోదీ, షాల నేతృత్వంలోని పార్టీ తేల్చి చెప్పింది. 2014 నుంచి బీజేపీ మొత్తం నాయకత్వ శ్రేణిని గమనించినట్లయితే, బహుశా ఇద్దరు మాత్రమే 75 ఏళ్లు దాటిన తర్వాత కూడా కేబినెట్ ర్యాంకును నిలుపుకోగలిగారు. అది కూడా చాలా కొద్ది కాలం మాత్రమే వారు మనగలిగారు. వారిలో తొలివ్యక్తి నజ్మా హెప్తుల్లా. ఈమె ఇంఫాల్ రాజభవన్‌కు చెక్కేశారు. ఇక రెండవవ్యక్తి కల్రాజ్ మిశ్రా. మంత్రివర్గం నుంచి ఉద్వాసన పిలుపు వచ్చేవరకు ఈయన నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తడంలోనే మునిగిపోయారు. అయినప్పటికీ ఈయన కూడా సిమ్లాలోని రాజ్‌భవన్‌కు బయలుదేరక తప్పింది కాదు. మోదీ, షాల నాయకత్వం విధించిన ఈ వయోపరిమితి నిబంధనను బీజేపీలో ఎవ్వరు కూడా తోసిపుచ్చిన ఘటన జరగలేదు. మోదీని శాశ్వత ప్రధానిగా ఉండాలని డిమాండు చేస్తున్న బీజేపీ నేతలు కూడా మోదీకి 75 ఏళ్లు నిండాక ఎన్డీఏ మూడవ దఫా పాలనలో ప్రధాని ఎవరు కాగలరు అనే అంశంపై అంచనాలు వేసుకోవడం ఉత్తమమన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఇక్కడే యడియూరప్ప ప్రత్యేక ప్రాభవం, అధికారం స్పష్టమవుతుంది. 75 ఏళ్లనాటికి మోదీ పదవీవిరమణ చేస్తారు అనే అభిప్రాయం కూడా ఇప్పుడు చెల్లని కాసులా మారవచ్చేమో మరి. ఒక చిన్న స్థాయి రాష్ట్రానికి ఈ విషయంలో మినహాయింపు నిచ్చినప్పుడు అతిశక్తిమంతుడైన మోదీ విషయంలో అది ఎందుకు సాధ్యపడదు? ఎన్నిరకాలుగా చూసినా, యడియూరప్ప.. మోదీ, షాల ముఖ్యమంత్రుల జాబితాలో ఆదర్శప్రాయ స్థానంలోనే ఉన్నారు. 2014 నుంచి మోదీ, షాలు ముఖ్యమైన రాష్ట్రాల్లో నియమించిన ముఖ్యమంత్రుల జాబితాను చూడండి. వీరిలో ఏ ఒక్కరూ తమ తమ రాష్ట్రాల్లోని అధిపత్య కులానికి చెందినవారు కారు. జాట్లు రాజ్యమేలుతున్న హరియాణాలో మనోహర్ లాల్ ఖట్టర్ సాంప్రదాయ విరుద్ధమైన పంజాబీగా మిగిలిపోయారు. ఇక జార్కండ్లో ఆదివాసీలకు అధికారాన్ని తోసిపుచ్చారు. మహారాష్ట్రలో సీఎం పదవిని చేపట్టిన యువ బ్రాహ్మణుడు దేవేంద్ర పఢ్నవిస్ అక్కడి మరాఠాల దృష్టిలో అంగుష్టమాత్రుడు మాత్రమే. అస్సోంలో సైతం అతి శక్తిమంతుడైన హిమంత బిస్వా శర్మ తనకంటే తక్కువ పలుకుబడి కలిగిన శరబానంద సోనోవాల్ నేతృత్వంలో పనిచేయాల్సి వస్తోంది. స్వయంసిద్ధంగా ఎదిగిన ప్రాంతీయ నేత బీజేపీ అధికారిక నమూనా ప్రకారం ఆ పార్టీకి ఇద్దరు అగ్రనేతలు మాత్రమే అవసరం. వారు కూడా ఢిల్లీలోనే నివసిస్తుంటారు. మిగిలినవారు ఆ ఇద్దరి ఆమోదంతో విశ్వాసంగా సేవ చేస్తుంటారు. కానీ యడియూరప్ప ఆ నిబంధననే తోసిపుచ్చేశారు. స్వయంసిద్ధంగా ఎదిగిన లీడర్‌గా ఆయన ప్రకటించుకున్నారు. యడియూరప్ప ఆధిపత్య కులానికి చెందిన నేత మాత్రమే కాదు. పదే పదే అధిష్టానాన్ని ధిక్కరించే అసమ్మతివాదిగా ఉంటూ వస్తున్నారు. పార్టీ తనను అధికారం నుంచి తొలగించినప్పుడు తన అనుయాయి అయిన సదానంద గౌడను తన స్థానంలో పార్టీ నియమించేలా ఒత్తిడి తీసుకొచ్చారు. అతడిని సైతం అస్థిరత్వానికి గురి చేసినప్పుడు యడియూరప్ప వేరే మార్గం లేక తిరుగుబాటు చేసి తనదైన రాజకీయ పార్టీని ఏర్పర్చి 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 6 ఎంపీ స్థానాలు మాత్రమే గెల్చుకున్నారు కానీ, లింగాయతుల ఓట్లను తాను కైవసం చేసుకోవడం ద్వారా 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 40 సీట్లకు దించివేశారు. కన్నడ రాజకీయాల్లో అపర చాణక్యుడు అవినీతి విషయంలో ఎవరినీ లెక్కచేసేది లేదంటూ బీజేపీ నిర్దేశించుకున్న మరొక ముఖ్య సూత్రాన్ని కూడా అది వదులుకునేలా చేశారు యడియూరప్ప. తన తొలి హయాంలో ఆయన లోకాయుక్త తీవ్ర విమర్శ కారణంగా అధికారం కోల్పోయారు, కొంత కాలం జైల్లో గడిపారు. తర్వాత ఆ కేసునుంచి బయటపడ్డారు. కానీ ఆయను అధికారం నుంచి తప్పించిన కారణంగా, ఎవరికీ ప్రశాంతత దక్కలేదు. దీంతో బీజేపీకి ఒకే అసెంబ్లీలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాల్సి వచ్చింది. దీని పర్యవసానం ఎంతవరకు వెళ్లిందంటే 2013లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో యడియూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకురావడమే కాదు.. తిరుగులేని ప్రాంతీయ నేతగా ఆయనకు పూర్వ స్థానం కూడా బీజేపీ కట్టబెట్టాల్సి వచ్చింది. ఇది మోదీ–షాల బీజేపీకి శాపంలాంటిది. పోల్చి చూడాలంటే గుజరాత్లో శంకర్ సింగ్ వాఘేలా ఉదంతాన్ని చూద్దాం. అత్యంత సమర్థుడు, కరుడు గట్టిన ఆరెస్సెస్ భావజాలం కలిగిన వాఘేలా బీజేపీనుంచి ఫిరాయించి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. కానీ బీజేపీ ఆయనకు మళ్లీ ఎన్నడైనా గుజరాత్‌ని అప్పగించిందా? వయస్సు, కులం, అవినీతి, విశ్వసనీయతా పరీక్ష వంటి అన్నింటినీ తోసిపుచ్చుతూ, యడియూరప్ప తన పార్టీనే ఒత్తిడికి గురిచేసి కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చి, ఆ మరుక్షణమే తమ ప్రభుత్వాన్ని ఏర్పర్చడంలో ఘనవిజయం సాధించారు. దీనికి భిన్నంగా మోదీ షా ద్వయం ముందుగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించి కొంతకాలం తర్వాత తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పర్చే పంధాకే ప్రాధాన్యం ఇచ్చి ఉంటారు. తద్భిన్నంగా అసాధారణంగా, ప్రయోజన రహితంగా యడియూరప్పకు అధికారం కట్టబెట్టక తప్పని పరిస్థితికి వారిద్దరూ లోనయ్యారు. ముగియని రాజకీయ క్రీడ అయితే కర్ణాటకలో రాజకీయ తమాషా ఇంకా ముగియలేదు. స్పీకర్ ఒక తార్కిక ముగింపు పలుకుతూ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, ప్రస్తుత అసెంబ్లీ కాలం ముగిసేంతవరకు వారిని పోటీచేయకుండా నిషేధించి కోర్టులు ఈ సమస్యను పరిష్కరించేంతవరకు ప్రస్తుత సంక్షోభాన్ని పొడిగించవచ్చు. రాజకీయ క్రీడ ఇంకా ముగియలేదు. కనీసం బీజేపీ కోరుకుంటున్న తరహాలో అయితే ఇది ముగింపుకు చేరలేదు. బీజేపీ నేటి ప్రమాణాల బట్టి చూస్తే ఈ కన్నడ కురువృద్ధుడి పలుకుబడి తిరుగులేని విధంగా ఈ సంక్షోభ సమయంలో వెల్లడయింది. యడియూరప్ప విజయం బీజేపీకి, దాని అధిష్టానానికి పంపే సందేశం ఏమిటంటే కర్ణాటకలో యువ నాయకత్వాన్ని నిర్మించుకోవడంలో అది విఫలమైందనే. రాష్ట్రంలో తన ప్రత్యర్థి అనంత్ కుమార్ ఆకస్మిక మరణం యడియూరప్పకు ఎంతగానో కలిసొచ్చింది. అంతకంటే ముఖ్యంగా నరేంద్రమోదీ పలుకుబడిపై ఆధారపడి కర్ణాటక అసెంబ్లీని గెలుచుకోలేమని బీజేపీ గుర్తించింది. తన హిందూ ఓటు బ్యాంకు లోపలే ఎదిగివచ్చిన తన సొంత నాయకుడి కుల ఓటు బ్యాంకు విసిరే సవాలును ఎదుర్కోవడం బీజేపీకి ఇదే తొలిసారి. మోదీ–షాలకు తొలి సవాల్ ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు కూడా ఈ పరిణామాన్ని గమనించవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రాంతీయ నాయకులు యడియూరప్ప తరహాలో విజయం సాధించిన స్థితిలో లేరు. రాజస్థాన్‌లో వసుంధరా రాజే ప్రస్తుతం అధిష్టానం తన అనుయాయులను తొక్కివేస్తూ తన ప్రత్యర్థులను అందలమెక్కిస్తున్న తీరును చూస్తూ ఊరకుంటున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ను గద్దె దింపడానికి తగినంత బలాన్ని, వనరులను శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అగ్రనాయకత్వం కల్పించడం లేదు. కానీ కర్ణాటక మినహాయింపు నుంచి స్ఫూర్తి పొందగల బీజేపీ నాయకులు మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఉన్నారు. చివరకు యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కోవలోకే రావచ్చు. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
ఉందామా, వెళ్లిపోదామా?
సంకీర్ణ సర్కారులో అసమ్మతీయులు భావి కార్యాచరణపై మంతనాల్లో మునిగి తేలుతున్నారు. ఇక మంత్రి పదవులు దక్కవని ఖాయం కావడంతో ఏం చేయాలా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తెగించి బీజేపీ శిబిరంలో చేరిపోదామా?, సర్ధుకుని ఇక్కడే ఉండిపోదామా? అనే సందిగ్ధంలోనూ ఉన్నట్లు సమాచారం. సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ మంత్రిమండలిలో చోటు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ సీనియర్లు ఉండాలా, వీడాలా? అనే అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్లుగా జెండా మోసినా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, బీజేపీలో చేరినా భవిష్యత్తు ఉంటుందా? అని మథనపడుతున్నట్లు తెలుస్తోంది. ఏదో ఒక తీవ్ర నిర్ణయం తీసుకోకతప్పదని నిశ్చయానికి వచ్చినట్లు సమాచారం. సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసమ్మతితో ఉన్నారు. మంత్రి పదవులు రాలేదని నామినేటెడ్ పోస్టులతో సర్దుకుపోవడమా?, బీజేపీలో చేరిపోవడమా? అని మరోదఫా తీవ్రంగా చర్చించారు. జార్కిహొళి నివాసంలో.. కేబినెట్ విస్తరణ అనంతరం కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలు భవిష్యత్తు ప్రణాళిక రచించేందుకు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంతో కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు భగ్గుమంటున్నారు. శుక్రవారం రాత్రి వారందరూ భేటీ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా రహస్యంగా సమావేశమై భవిష్యత్తు ప్రణాళిక గురించి రచించినట్లు తెలిసింది. కాంగ్రెస్ అసమ్మతి నేత, ఎమ్మెల్యే రమేశ్ జార్కిహొళి నివాసంలో భేటీ జరిగినట్లు తెలుస్తోంది. జార్కిహోళి నివాసానికి శనివారం ఉదయం కూడా మస్కి ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్ వచ్చి మాట్లాడారు. వారే వస్తే ఆహ్వానిస్తాం: యడ్యూరప్ప మరోవైపు సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని తమకు లేదని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ఆ రెండు పార్టీల్లో అసమ్మతి పెరిగి రాజీనామా చేసి బీజేపీలో చేరితే ఆహ్వానిస్తామన్నారు. సీఎం కుమారస్వామికి వ్యతిరేకంగా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి నిర్ణయం ఏ నిమిషంలో అయినా ప్రభుత్వానికి ప్రమాదమే అని చెప్పారు. వారంతట వారే బీజేపీలోకి వస్తే ఆహ్వానించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆవేదనలో సీనియర్లు కేబినెట్లోకి దారులు మూసుకుపోయాయని కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పార్టీకి కేటాయించిన బెర్తులన్నీ భర్తీ అయ్యాయి. తమకు చాన్స్ ఇవ్వాలంటే కొందరిని తొలగించి అసమ్మతి నేతలను చేర్చుకోవాలి. ఆ పని జరిగేనా? అని అనుమానంతో ఉన్నారు. ఎన్నాళ్లు ఇలా.. తొలగిస్తూ.. చేరుస్తూ పోవాలని.. పార్టీ పెద్దలు చొరవ తీసుకుని నియంత్రించాలని జేడీఎస్ నేత దేవెగౌడ ఇప్పటికే ప్రశ్నించారు. హాజరైంది వీరే శుక్రవారం రాత్రి అథణి ఎమ్మెల్యే మహేశ్ కుమటళ్లి భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ భేటీపై మీడియా ప్రతినిధులు సంప్రదించగా రమేశ్ జార్కిహోళి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. మహేశ్ కుమటళ్లి (అథణి), ప్రతాప్‌గౌడ పాటిల్ (మస్కి), నాగేంద్ర (బళ్లారి రూరల్), గణేశ్ (కంప్లి), ఆనంద్‌సింగ్ (హొసపేటె), సుధాకర్ (చిక్కబళ్లాపుర), బీకే సంగమేశ్ (భద్రావతి), బీసీ పాటిల్ (హిరేకరూరు) ఉన్నట్లు తెలిసింది. -
సొంత పార్టీని ఇరుకున పెట్టిన వైనం
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నోరు జారారు. దావణగెరెలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పతో పాటు పార్టీనీ ఇరుకున పెట్టారు. సిద్దరామయ్య అనడానికి బదులుగా యడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అంటూ మాట తూలారు. ప్రసంగంలో అమిత్ షా ఏమన్నారంటే.. ‘ఈ మధ్య సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఒకరు నాతో మాట్లాడారు. అవినీతి ప్రభుత్వాల మధ్య పోటీ పెడితే కచ్చితంగా యడ్యూరప్ప ప్రభుత్వం నంబర్ వన్‌గా నిలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అదే వేదికపై ఉన్న యడ్యూరప్ప ముఖం కందగడ్డలా మారిపోయింది. పక్కనే కూర్చున్న ఎంపీ ప్రహ్లాద్ జోషి అవాక్కయ్యారు. సిద్దరామయ్య ప్రభుత్వం అంటూ షా చెవిలో ఊదారు. వెంటనే సర్దుకుని.. సిద్దరామయ్య అంటూ అమిత్ షా ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే, కాంగ్రెస్ మద్దతుదారులు అప్పటికే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయటం, అది వైరల్‌గా మారటం చకచకా జరిగిపోయాయి. దీనిపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. ‘అబద్ధాల పుట్ట అయిన అమిత్ షా ఇన్నాళ్లకు నిజం మాట్లాడారు.. ధన్యవాదాలు..’అంటూ ట్వీట్ చేశారు. ‘అమిత్ షా కూడా నిజాలు చెబుతారని ఎవరికీ తెలీదు. మీ వ్యాఖ్యలతో మేమూ ఏకీభవిస్తున్నాం..’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి రమ్య ట్వీట్ చేశారు. గెలుపు మాదే కర్ణాటకలో ఈసారి 150 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు తమదేనని, యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం తథ్యమని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగుర వేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న లింగాయత్, వీరశైవుల మధ్య సిద్దరామయ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. బీజేపీ విజయం ఖాయమని తేలడంతో కాంగ్రెస్ కుల, మత రాజకీయాలకు తెరలేపిందన్నారు. కాంగ్రెస్ పాలన ఐదేళ్లలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పటికి సిద్దరామయ్యకు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. -
మహానగర పాలికేకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఎంపీ.అనంతకుమార్ బనశంకరి,న్యూస్‌లైన్ : బెంగళూరు మహానగర సమగ్రాభివృద్ధి కోసంబీబీఎంపీకి రూ.10 వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బెంగళూరు దక్షిణ ఎంపీ.అనంతకుమార్ డివ ూండ్ చేశారు. మంగళవారం పద్మనాభనగర విధానసభ నియోజకవర్గం పరిధిలోని యడియూరు వార్డు సౌత్ ఎండ్ సర్కిల్ వద్ద రూ.8 కోట్ల నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు అన ంతకుమార్ భూమిపూజ నిర్వహించి మాట్లాడారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నందున బీబీఎంపీకి నిధులు విడుదల చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తారతమ్యం చూపిస్తున్నాయని ఆరోపించారు. బీబీఎంపీకి జరుగుతున్న అన్యాయంపై శీతాకాల పార్లమెంటు సవ ూవేశాల్లో ప్రస్తావిస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ టికెట్లు కేటాయింపులో పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, అర్హులైన వారికే పార్టీ టికెట్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పకు పార్టీలో ఉన్నత స్థానం ఇచ్చే విషయం పార్టీ అధినాయకత్వానికి వదిపెట్టామన్నారు. ఢిల్లీ వ ుుఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ పరిపక్వత సాధించలేని వ్యక్తి అని అనంతకుమార్ అన్నారు. ఢిల్లీలో ఆమ్ఆద్మీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్తిరపరచడానికి బీజేపీ నేతలు రూ.20 కోట్లు సుపారి ఇచ్చారన్న కేజ్రీవాల్ ఆరోపణలపై అతను ఒక మతిస్థిమితం లేని వ్యక్తిగా అభివర్ణించారు అనంతకుమార్. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్ మాట్లాడుతూ... బీఎస్ .యడ్యూరప్ప సముచితస్థానం అందించాలని రాష్ర ్టబీజేపీ శాఖ పార్టీ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసిందన్నారు. బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజవర్గం నుంచి పార్టీ టికెట్ అందించాలని ఎవరిని తాను అడగలేదని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానంటూ పరోక్షంగా మాజీ సీఎం సదానందగౌడను ఉద్దేశించి అన్నారు. పార్టీలో అందరూ సమిష్టిగా కృషి చేసి లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలవాలన్నదే తమ ఆశయమన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎన్ఆర్.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీని బీజేపీలో విలీనం చేస్తా:యాడ్యూరప్ప
బెంగళూరు: తాను స్థాపించిన కేజేపీ(కర్ణాటక జనాతా పార్టీ)ని త్వరలో బీజేపీలో విలీనం చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు యాడ్యూరప్ప తెలిపారు. వచ్చే ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా యాడ్యూరప్ప నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతోనే తాను తిరిగి బీజేపీలోకి చేరుతున్నట్లు యాడ్యూరప్ప గతంలోనే స్ఫష్టం చేసిన సంగతి తెలిసిందే. యడ్యూరప్పను సాదరంగా ఆహ్వానించాలని బీజేపీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపింది. వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి యడ్యూరప్ప శక్తియుక్తులను బీజేపీ వినియోగించుకోనుంది.