బిరియానీ భామ
కోలీవుడ్‌లో బిరియానీతో హీరోయిన్లను లోబరచుకునే నటుడిగా ఆర్యకు పేరుంది. అలా ఆయనే తొలి హీరోగా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన నటి ఎమిజాక్సన్. మదరాసు పట్టణం చిత్రం ఆమెకు ఇక్కడ ఒక స్థానాన్ని ఏర్పరచింది. శంకర్ చిత్రం ఐ మరింత పాపులర్ చేసింది. ప్రస్తుతం నటుడు ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టాదారి-2 చిత్రంతో పాటు ఉదయనిధి స్టాలి న్‌కు జంటగా గెత్తు చిత్రంలోను నటిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్‌లో తొలి చిత్రం ఏక్ దివాన్ తా నిరాశపరిచినా తాజాగా మరో చిత్రాన్ని అందిపుచ్చుకున్నారు. ఈ ఇంగ్లిష్ భామ ఇంతకుముందు పిజ్జాలు, బర్గర్లుతినేవారట. ఇప్పుడు ఆమె ఇష్టంగా లాగించే ఆహారం బిరియానీ అట. ఇతర ఆహారపు అలవాట్లలో తన తల్లితో షేర్ చేసుకునే ఎమిబిరియానీ వరకు తన తల్లి వాటాను కూడా తనే లాగించేస్తున్నారట. అంతగా బిరియానీకి బానిసయ్యారట ఎమిజాక్సన్. తింటారు. ఇది ఆర్యతో స్నేహ దోషం ఏమో!