అమీపై అంత కోపమేల బిప్స్!
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బుంగమూతి పెట్టింది. కదిలిస్తే చాలు కస్సుబుస్సులాడుతోంది. ఆ కోపం ఎవరి మీదనేగా? ఇంకెవరు... ఎవడు, ఐ చిత్రాలతో మనకు పరిచయమైన అమీ జాక్సన్ మీదే.
దాంతో కొందరు... కొంపదీసి బాలీవుడ్‌లో అతి సహజమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ వీళ్ల మధ్య కూడా చిచ్చుపెట్టిందా ఏంటి అంటూ ఆరాలు తీస్తున్నారు. అయితే నిజానికి అమీపై బిప్స్ అలగడానికి కారణం ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ యూనిట్. వాళ్లు తాజాగా ఆ చిత్ర పోస్టర్స్‌ను విడుదల చేశారు.
వాటిలో అక్షయ్, అమీలు మాత్రమే కనిపిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ అయిన బిపాసా కనిపించడం లేదు. దాంతో అమీపై అక్కసుతో రగిలి పోతోందట బిప్స్!