నేడు ‘నమో’ ప్రార్థనా గీతం విడుదల | Narendra Modi prayer songs released today in tamilnadu | Sakshi
Sakshi News home page

నేడు ‘నమో’ ప్రార్థనా గీతం విడుదల

Published Sun, Jan 5 2014 9:36 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

నేడు ‘నమో’ ప్రార్థనా గీతం విడుదల - Sakshi

నేడు ‘నమో’ ప్రార్థనా గీతం విడుదల

 నరేంద్రమోడీపై తమిళంలో తొలి ప్రార్థనా గీతం
 రాష్ట్ర ‘నమో’ సమాఖ్య వినూత్న సృష్టి
 ఏ రాజకీయ నాయకుడికీ దక్కని అరుదైన గౌరవం


 
చెన్నై: భారత రాజకీయ చరిత్ర లో ఏ రాజకీయ నాయకుడికీ దక్కని అరుదైన గౌరవం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి దక్కింది. అందునా పరాయి రాష్ట్రమైన తమిళనాడులో ఈ గౌరవం దక్కడం విశేషం. తమిళనాడులోని నరేంద్రమోడి అభిమానుల సమాఖ్య ఆయన విజయాలను కీర్తిస్తూ తమిళంలో ప్రత్యేక పార్థనా గీతాన్ని రచించారు. ఈ విషయమై నమో సమాఖ్య వ్యవస్థాపకుడు ఎ.వినోద్ విలేకరులతో మాట్లాడుతూ నమో ప్రార్థనా గీతం సంగీతం, సాహిత్య పరంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందన్నారు.


 
 దీన్ని ఇతర భాషల్లోకి ఎవరూ కాపీ చేయకుండా ఉండేలా సాహిత్యాన్ని రూపొందించామన్నారు. ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ నమో ప్రార్థనా గీతాన్ని కౌశిక్, మాళవిక, సత్యప్రకాష్, సూపర్ సింగర్ ఫేం ప్రవీణ్ తదితరులు ఆలపించారని పేర్కొన్నారు. జాతికి దశ-దిశా నిర్దేశం చేయగల సత్తా నరేంద్రమోడీకి మాత్రమే ఉందని ఈ గీతం చెబుతుందన్నారు. ప్రార్థనా గీతం కొనసాగుతున్నంతసేపూ నేపథ్యంలో నమో...నమో...నమో అనే మంద్రస్థాయి ఉచ్ఛరణ విన్పిస్తుందన్నారు.


 
 దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ గీతం నరేంద్రమోడీ గురించి క్షుణంగా వివరిస్తుందన్నారు. ఈ గీతం విన్న వారెవరైనా రానున్న ఎన్నికల్లో మోడీకి మాత్రమే ఓటు వేస్తారని తెలిపారు. దీనిని మొబైల్ రింగ్‌టోన్‌గా కూడా ఉపయోగించనున్నట్లు వివరించారు. ఆదివారం కోవైలోని ఒక మ్యారేజీ హాలులో పలువురు బీజేపీ ప్రముఖుల సమక్షంలో ఈ గీతాన్ని విడుదల చేస్తామన్నారు. ‘నమో’ అభిమానుల సమాఖ్యలోని ఎనిమిది వేల మంది కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాఖ్య వ్యవ స్థాపకుడు వినోద్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement