ఇందిరాగాంధీకి ఘన నివాళి | Nation remembers Indira Gandhi on 29th death anniversary | Sakshi
Sakshi News home page

ఇందిరాగాంధీకి ఘన నివాళి

Published Fri, Nov 1 2013 2:29 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Nation remembers Indira Gandhi on 29th death anniversary

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుని డీపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీపీసీసీ అధ్యక్షుడు జయప్రకాశ్ అగర్వాల్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాలంజలి ఘటించారు. భారతదేశ రాజకీయాలతోపాటు ప్రపంచ రాజకీయ చరిత్రలోనూ ఇందిరాగాంధీకి ఎంతో పేరుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో పథకాలను రూపొందించారని కొనియాడారు. 
 
 పేదరికాన్ని రూపుమాపేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ గుర్తుండే నాయకుల జాబితాలో ఇందిరాగాంధీకి శాశ్వతంగా స్థానం  ఉంటుందన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన నాయకురాలు అన్నారు. శాస్త్ర సాంకేతిక  రంగాల్లోనూ మన దేశం ఉన్నత స్థానంలో ఉండాలని ఆమె కోరుకుందన్నారు. కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఎస్‌కే.పురీ, సురేశ్‌మాలిక్, రాజేంద్ర మాలిక్, సుదేశ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement