సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)-2017ను హిందీ, ఆంగ్లం సహా ప్రాంతీయ భాషలైన తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళ భాషల్లోనూ నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. లోక్‌సభ కె.పరశురామన్ అడిగిన ఓ రాతపూర్వక ప్రశ్నకు శుక్రవారం ఆమె సమాధానం ఇచ్చారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎలాంటి కోటాను నిర్ధారించలేదని, రాష్ట్ర కోటా సీట్లపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల రిజర్వేషన్ పాలసీలకు నీట్ పరీక్ష ఎలాంటి విఘాతం కల్పించబోదని తెలిపారు.