న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో పునరాభివృద్ధి చేయనున్న ఆంధ్రప్రదేశ్ భవన్‌లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అనేక రెస్టారెంట్లు, బహుళ ప్రయోజన అపార్ట్‌మెంట్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నారు. జాతీయ రాజధానిలో ఈ చారిత్రక భనాన్ని పునర్‌నిర్మించేందుకు సంబంధించి నవరత్న కంపెనీల్లో ఒకటైన పట్టణాభివృద్ధి శాఖ కింద పనిచేస్తున్న జాతీయ భవన నిర్మాణ సంస్థ (ఎన్‌బీసీసీ)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సంప్రదించింది.
ఇందుకు స్పందించిన ఎన్‌బీసీసీ ఏపీ భవన్ పునరాభివృద్ధికి సంబంధించి ఓ ప్రణాళిక తో ముందుకొచ్చింది. ఈ భవన్ వెంట సర్వీస్ అపార్ట్‌మెంట్లు, విభిన్నమైన శైలిలో అతిథి గృహాన్ని నిర్మించాలని ఎన్‌బీసీసీ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ అపార్ట్‌మెంట్లలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ భవన్‌లో ఒక్కసారి భోజనం చేస్తే ఢిల్లీ వాసులకు మళ్లీ మళ్లీ రావాలని అనిపించేవిధంగా చేయాలనే సంకల్పంతో అధికారులు ఉన్నారు. ఆంధప్రదేశ్‌కు చెందిన వివిధ రకాల వంటకాలతో కూడిన రెస్టారెంట్లు ఇక్కడ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
రెండు వేల సీట్ల సామర్థ్యం కలిగిన కన్వెన్షన్ సెంటర్ పునరాభివృద్ధిలో భాగంగా ఏపీ భవన్ ప్రాంగణంలో రెండు వేల సీట్ల సామర్థ్యం కలిగిన కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ విషయమై ఎన్‌బీసీసీ చైర్మన్ అనూప్‌కుమార్ మిట్టల్ మాట్లాడుత ‘ఏపీ భవన్‌లో రెండు వేల సీట్ల సామర్థ్యం కలిగిన ఓ క న్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలని ప్రతిపాదించాం. ఈ సౌకర్యం ఏపీభవన్‌లో ఉంటే విజ్ఞాన్ భవన్ తర్వాత నగరంలో ఇదొక హేపెనింగ్ సెంటర్‌గా మారుతుంది’ అని అన్నారు. క న్వెన్షన్ సెంటర్, సర్వీస్ అపార్ట్‌మెంట్ల వల్ల ఏపీ ప్రభుత్వానికి రాబడి వస్తుందన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు విడిది చేసేందుకు వారికి కూడా సకల సౌకర్యాలతో కూడిన గదులను నిర్మిస్తామన్నారు.
చర్చలు జరిపిన చంద్రబాబు
ఏపీ భవన్ పునరాభివృద్ధి విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎన్‌బీసీసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ భవన్ మొత్తం 19 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రకు 10.6, తెలంగాణకు మిగతా స్థలం దక్కనుంది. ఏపీభవన్ నగరంలోని అశోకారోడ్డులోగల ఇండియా గేట్ వద్ద ఉంది. హైదరాబాద్ హౌస్‌కు ఆనుకుని ఉంది. ప్రస్తుతం ఈ కాంపౌండ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రం ఉంది.
కొత్త ఏపీ భవన్‌లో సకల సౌకర్యాలు
Published Sun, Nov 16 2014 10:18 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM
Advertisement
Advertisement