సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని 11 తాత్కాలిక పోలీసు శిక్షణా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎట్టి పరిస్థితుల్లో నిధుల కొరత రానివ్వబోమని రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టం చేశారు. తక్షణమే రూ 50 లక్షలను విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బెంగళూరులో కేఎస్‌ఆర్పీ నూతన భవనాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించన ఆయన మాట్లాడారు. రాష్ట్ర పోలీసు శాఖలో 27 వేల సిబ్బంది కొరత ఉందన్నారు.
సాధ్యమైనంత త్వరగా ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అదేవిధంగా శిక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా పెద్దపీఠ వేస్తామని తెలిపారు. పోలీసు అధికారుల రోజువారి కార్యక్రమాల్లో ప్రభుత్వం కలుగజేసుకోదన్నారు. అయితే తప్పుచేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని కేజే జార్జ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి రామలింగారెడ్డి, ఎమ్మెల్యే హారీష్ తదితరులు పాల్గొన్నారు.
నిధుల కొరత రానివ్వం
Published Wed, Oct 15 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM
Advertisement