సాక్షి, చెన్నై : ఇంజినీరింగ్ విద్యపై ఆసక్తి తగ్గుతోందని దరఖాస్తుల పర్వంలో స్పష్టం అవుతోంది. దరఖాస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసినా, సమర్పించిన వాళ్లు మాత్రం తక్కువే. అన్నావర్సిటీ బీఈ, బీటెక్ కోర్సుల ఆహ్వానానికి స్పందన కరువైంది. ప్లస్‌టూ అనంతరం ఉన్నత విద్య ను అభ్యసించాలన్న తలంపుతో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంపి క చేసుకుంటారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రూపులను ఎంపిక చేసుకునే వాళ్లు కొందరు అయితే, న్యాయ, పాలిటెక్నిక్ కోర్సుల బాట పట్టేవారు కొందరు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ మీద దృష్టి పెట్టే వాళ్లు అధికం. ఒకప్పుడు ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్రంలో భలే గిరాకీ ఉండే ది. ఎంబీబీఎస్ సీట్లు మెరిట్ విద్యార్థుల దరి చేరుతూ వచ్చారుు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా విధానం మేరకు ఇంజినీరింగ్ కోర్సుల భర్తీ అన్నావర్సిటీ మీద ఉంది. ప్రతి ఏటా ఈ వర్సిటీ నేతృత్వంలో దరఖాస్తులను ఆహ్వానించడం, రాష్ట్రంలోని ఆయా కళాశాలలను విద్యార్థులు ఎంపిక చేసుకోవడం జరుగుతూ వస్తోంది.
తగ్గుతున్న ఆసక్తి
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే కళాశాలలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు 570 వరకు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ కోటా సీట్లు మాత్రం రెండు లక్షలు, ఇక యాజమా న్య , ఇతరత్రా కోటా సీట్లు ఆయా కళాశాలల సామర్థ్యాన్ని బట్టి ఉన్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వ కోటా సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. ప్రాధాన్యం కలిగిన కళాశాలల్లోని కోర్సులు మాత్రం చకచకా పూర్తి అవుతున్నాయి. అయితే, దక్షిణాది జిల్లాల్లోని అనేక కళాశాలల్లో సీట్ల భర్తీ పూర్తిస్థాయిలో జరగడం లేదు. గత ఏడాది రెండు లక్షల 38 వేల దరఖాస్తులు విక్రయించారు. వచ్చింది మాత్రం లక్ష 90 వేలు , ఇందు లో కొన్ని తిరస్కరణకు గురయ్యాయి. కౌన్సెలింగ్‌కు 40 వేల మంది హాజరు కాలేదు. దీంతో ప్రభుత్వ కోటా సీట్లు సుమారు 80 వేలు భర్తీ కాలేదు. ఈ ఏడాది ఆ సంఖ్య లక్ష దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది 25 వేల దరఖాస్తుల విక్రయం తగ్గాయి. వచ్చిన దరఖాస్తులు గత ఏడా ది కంటే 20 వేల వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో అన్నావర్సిటీ వర్గాలు అయోమయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంజినీరింగ్‌పై మక్కువ తగ్గుతోందా? అన్న విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్షా 70 వేల వరకు మాత్రమే దరఖాస్తులు వచ్చిన దృష్ట్యా, ఇందులో కొంత మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు డుమ్మా కొట్టడం ఖాయం. ఈ దృష్ట్యా, ఈ ఏడాది లక్ష సీట్ల వరకు ఖాళీగా దర్శనం ఇవ్వనున్నాయి.
ఆందోళన
ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఇటీవల తగ్గు తున్నాయి. విదేశాల్లో బీఈ పూర్తి చేసిన వారి కన్నా, ఆ తర్వాత ఎంఈ పూర్తి చేసిన వారికే ఉద్యోగాలు దక్కుతున్నా యి. దీంతో ఆ కోర్సులను ఎంపిక చేసుకుని నిరుద్యోగులుగా మిగలడం కన్నా, ప్రత్యామ్నాయ కోర్సుల మీద విద్యార్థులు దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డా రు. ఈ పరిణామాలు ఇంజినీరింగ్ కళాశాలలను ఆందోళనలో పడేస్తున్నాయి. ప్రాధాన్యం, పబ్లిసిటీ ఉన్న కళాశాలల్లో సీట్ల భర్తీ పూర్తి స్థాయిలో సాగుతున్నా, మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉండే కళాశాలలు, అంతగా ప్రాచుర్యం లేని కళాశాలలు గగ్గోలు పెట్టే పరిస్థితి నెల కొంది. తమ కళాశాలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, పరిస్థితి ఇలాగే ఉంటే కళాశాలలకు తా ళం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుం దన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
లక్ష సీట్లు ఖాళీ
Published Wed, May 28 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement
Advertisement