![Online Engagement Photos Viral in Social Media Karntaka - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/10/ktk.jpg.webp?itok=1CE-Xo4K)
కర్ణాటక, శివాజీనగర: కరోనా వైరస్ వల్ల శుభకార్యాలకు చిక్కొచ్చి పడింది. వందలాది పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు వాయిదా పడ్డాయి. కానీ ఓ జంట ఆన్‌లైన్ ద్వారా నిశ్చితార్థం చేసుకుంది. బెళగావి జిల్లా హుక్కెరి తాలూకాలోని అత్తిహాళ హైస్కూల్ హెచ్‌ఎం పీ.డీ.పాటిల్ తన కుమార్తె అనూషా నిశ్చితార్థాన్ని మొబైల్‌ఫోన్ వీడియో కాల్ ద్వారా నిర్వహించారు. సంకేశ్వరలో అనూషా ఉండగా, బాగల్‌కోటలో కాబోయే భర్త మహంతేశ ఉంటారు. ఇద్దరి కుటుంబాలూ వీడియోలో చూసుకుంటూ నిశ్చితార్థం వేడుకను పూర్తిచేశారు. ఈ ఆన్‌లైన్ నిశ్చితార్థం చిత్రాలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి.
Comments
Please login to add a commentAdd a comment