
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్తానీ!
న్యూఢిల్లీ: స్మగ్లింగ్ కేసులో భారత్‌లో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్‌కి చెందిన ఓ వృద్ధుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. శిక్షాకాలం గతేడాది ఏప్రిల్ 6న ముగిసినప్పటికీ గత ఎనిమిది నెలలుగా జైల్లో నిర్బంధించారని, తనని స్వదేశానికి పంపించాలని కోరుతూ మహ్మద్ హనీఫ్(85) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
పిటిషన్‌ను జస్టిస్ ఏకే పతాక్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఫిబ్రవరి 2లోపు వివరణివ్వాలని ఢిల్లీ, కేంద్ర ప్రభుతాల్ని ఆదేశించింది.