చెట్టును ఢీకొట్టిన బస్సు : ప్రయాణికులకు గాయాలు | passengers injured in road accident in west godavari district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొట్టిన బస్సు : ప్రయాణికులకు గాయాలు

Published Tue, Oct 4 2016 7:00 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

passengers injured in road accident in west godavari district

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ ట్రావెల్స్ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించిబోయే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement