న్యూఢిల్లీ: లిక్కర్ వ్యాపారి పాంటి చద్దా హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మందిపై ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. వీటిపై 28 నుంచి విచారణ జరపనున్నట్లు ప్రకటించింది. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఉత్తరాఖండ్ మైనారిటీ ప్యానెల్ చీఫ్ సుఖ్‌దేవ్‌సింగ్ నామ్‌ధారి కూడా ఉన్నారు. 2012లో ఫామ్‌హౌస్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో చద్దాతోపాటు అతని సోదరుడు హర్దీప్ కూడా మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 21 మందిపై హత్య అభియోగాలు మోపిన న్యాయమూర్తి విమల్ కుమార్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నామ్‌ధారి, అతని వ్యక్తిగత రక్షణ అధికారి(పీఎస్‌ఓ) సచిన్ త్యాగిపై శిక్షార్హమైన నేరం చేశారనే అభియోగాలు నమోదు చేశారు.
ఇందుకుగల కారణాలను వివరిస్తూ... 2012, నవంబర్ 17న జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఈ కాల్పుల ఘటన జరిగింది. అకస్మాత్తుగా, ఊహించని రీతిలో జరిగిన ఘటనగా కోర్టు అభిప్రాయపడింది. మృతుడు హర్దీప్ సీన్‌లోకు ఊహించని రీతిలో ప్రవేశించి, హత్యకు గురైనందున ఈ ఇద్దరిపై హత్యాభియోగాలు కాకుండా శిక్షార్హమైన నేరంగానే అభియోగాలు నమోదు చేశారు. ఇవి రుజువైతే ఈ ఇద్దరికి జీవితఖైదు శిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కేసు విచారణ ఈ నెల 28 నుంచి జరగనుంది. ప్రాసిక్యూషన్ తరఫు సాక్షుల వాంగ్మూలాలను ముందుగా రికార్డు చేస్తారని కోర్టు వర్గాలు తెలిపాయి.
పాంటి చద్దా హత్య కేసు 21 మందిపై అభియోగాలు
Published Sat, Feb 15 2014 11:44 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
Advertisement