విశ్వాసం కోల్పోయారు
Published Sat, Nov 30 2013 11:25 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ :దేశరాజధానిలో పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, తప్పుడు వాగ్దానాలతో ఢిల్లీవాసులను మోసగించలేమన్న విషయం ఆపార్టీ నాయకులకు తెలిసిపోయిందని బీజేపీ ప్రధానమంత్రి అభ్య ర్థి నరేంద్రమోడీ అన్నారు. అందుకే ఢిల్లీలో బహిరంగ సభలకు రావడానికి మోహం చాటేస్తున్నారంటూ కాంగ్రెస్‌ను విమర్శించారు. తాను ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాని, ఆ రాష్ట్రాల్లో ఆయా పార్టీల నాయకులు ఎన్నికల్లో పోరాడుతుండగా, ఢిల్లీలో సామాన్య ఓటర్లే కాంగ్రెస్‌పై పోరుకు సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు.
వరుస ర్యాలీల్లో భాగం గా శనివారం ఢిల్లీలోని షహద్రాలోని సీబీడీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మధ్యాహ్నం ఒంటి గంటకు మాట్లాడారు. అనంతరం సుల్తాన్‌పురా మాజ్రాలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణానగర్ నియోజకవర్గంలో ని సీబీడీ మైదానంలో బహిరంగ సభకు జనం కిక్కిరిపోయారు. మోడీ ప్రసంగానికి ముందు ‘మోడీ..మోడీ..’ అన్న నినాదాలు హోరెత్తాయి. వేలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి ‘భారత్‌మాతాకీ జై...’ అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభిం చారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఢిల్లీవాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోడీ అన్నారు.
బీజేపీ గెలిచిన తర్వాత బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ నాయకత్వంలో నిజాయితీతో పనిచేసే ప్రభుత్వం ఏర్పడుతుందన్న విశ్వా సం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత పెంచేలా ఈ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. గుజరాత్ మాదిరిగా ‘వన్‌డే గవర్నెన్స్’ను ఢిల్లీలోనూ ప్రవేశపెడతామన్నారు. స్వాం తంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కువకాలం అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించు పాలిం చు అన్న ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీలో అత్యంత నిర్లక్ష్యాని గురైన ప్రాంతం ఏది అన్ని మోడీ ప్రశ్నించినప్పుడు ‘యమునా తీర ప్రాంత’మంటూ సభికులు పెద్దపెట్టున సమాధానం చెప్పా రు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు విసుగు చెంది ఢిల్లీవాసులే ప్రత్యక్షంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోరాడుతున్నారని మోడీ వ్యాఖ్యానిం చారు. ప్రపంచప్రఖ్యాతి గాంచిన ఆర్థికవేత్తలైన డాక్టర్ మన్మోహన్‌సింగ్, పి.చిదంబరం వంటి వారు సైతం దేశంలో ధరలను నియంత్రిచలేకపోయారని విమర్శించారు. డిసెంబర్ 8 తర్వాత విడుదలయ్యే ఫలితాల్లో కాంగ్రెస్‌కు 1977లో వచ్చిన వాటికంటే తక్కువ సీట్లు వస్తాయని బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్‌జైట్లీ అన్నారు. బీజేపీకి ఓటు వేసేం దుకు ఢిల్లీవాసులు సిద్ధంగా ఉన్నారని బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ అన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్‌గడ్కరీ, నవజ్యోతిసింగ్ సిద్ధు, విజయ్‌గోయల్ తదితరులు పాల్గొన్నారు.
ఇంకు కనిపిస్తేనే భోజనం పెట్టండి
ఎన్నికల ప్రచారంతోపాటు పనిలోపనిగా ఓటుహక్కు ఆవశ్యకతను తనదైన శైలిలో వివరించారు మోడీ. విధానసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ నాలుగు ఓటు వేసి ఉన్నట్టు చేతివేలుపై ఇంకు ఉందో లేదో చూసిన తర్వాత భోజనం పెట్టాలని మహిళలకు మోడీ సూచించారు.
Advertisement