రాజీవ్ హంతకుడిపై జైల్లో దాడి | Rajiv Gandhi assassination case convict AG Perarivalan attacked by a fellow prisoner in Vellore prison | Sakshi
Sakshi News home page

రాజీవ్ హంతకుడిపై జైల్లో దాడి

Published Tue, Sep 13 2016 10:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

రాజీవ్ హంతకుడిపై జైల్లో దాడి

రాజీవ్ హంతకుడిపై జైల్లో దాడి

చెన్నై : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో మరణ శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరరివలన్‌పై తోటి ఖైదీ ఇనుప రాడ్తో దాడి చేశాడు. వేలూరు జైల్లో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అతడిపై మంగళవారం ఉదయం ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన పెరరివలన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

కాగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ రాజేశ్ కన్నా ఈ దాడికి పాల్పడినట్లు వెల్లూరు రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ తెలిపారు.  పెరిరవలన్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అతని నుదుటిపై గాయానికి నాలుగు కుట్లు పడినట్లు తెలిపారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు. కాగా  9వోల్టుల బ్యాటరీద్వారా బాంబు పేల్చి  రాజీవ్ను హత్య చేయడంలో పెరరివలన్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement