యువతకు మార్గదర్శకంగా నిలవండి
Published Fri, Oct 18 2013 12:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
సాక్షి, ముంబై: శివసేనలో అసంతృప్తితో కొనసాగే కంటే యువతరానికి మార్గదర్శకుడిగా నిలవడానికి కృషి చేయాలని సీనియర్ నాయకుడు మనోహర్ జోషికి ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే హితబోధ చేశారు. ఠాణేలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘గత సంవత్సరం నవంబర్‌లో శివసేన అధినేత బాల్‌ఠాక్రే అంత్యక్రియలు శివాజీపార్కు మైదానంలో జరి గాయి. ఈ తంతు పూర్త్తయిన రెండు, మూడు రోజుల్లోనే అదే మైదానంలో ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని జోషీ డిమాండ్ చేశారు. పార్టీ నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించకుండా ఇలా తొందరపడి డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదు. జోషీ డిమాండ్‌తో ఇటు ఉద్ధవ్‌ను అటు పార్టీని ఇబ్బందుల్లో పడేసింది’ అని అన్నారు. .
జోషీ పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఉద్ధవ్ తప్పకుండా క్షమించే అవకాశాలున్నాయని, పార్టీని విడనాడవద్దు’’ అని జోషీకి అఠవలే సలహా ఇచ్చారు. శివసేన నేతృత్వంపై జోషీ బహిరంగంగా విమర్శలు చేసిన ఫలితంగా శివసైనికుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. శివాజీ పార్కు మైదానంలో జరిగిన దసరా ర్యాలీలో జోషీకి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలుచేసి ఆయన తనంతట తానుగా వేదిక దిగిపోయేలా చేశారు. దీంతో జోషీ రాజకీయ భవితవ్యమేమిటనే అంశంపై వివిధ పార్టీల నాయకులు బేరీజు వేసుకుంటున్నారు.
ఇదిలాఉండగా ఏ లోక్‌సభ నియోజక వర్గం కావాలంటూ జోషి ఇంత రాద్ధాంతం సృష్టించారో అదే నియోజక వర్గాన్ని శివసేన, బీజేపీలో మిత్రపక్షంగా కొనసాగుతున్న ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే డిమాండ్ చేయడంతో కొత్త వివాదానికి దారితీసే పరిస్థితి నెలకొంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ మధ్య ముంబై, కల్యాణ్, పుణే, సాతారా, రామ్‌టెక్, వర్ధా స్థానాలు కావాలని ఆఠవాలే డిమాండ్ చేశారు. ఇం దులో కనీసం మూడు లోక్‌సభ నియోజక వర్గాలు, ఒక రాజ్యసభ స్థాన ం ఇవ్వాలని పట్టుబట్టనున్నట్లు అఠవాలే చెప్పారు. వచ్చే వారంలో తను ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండేలతో సమావేశమవుతానన్నారు. అప్పుడే పోటీ చేసే నియోజక వర్గాల విషయంలో తుది నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు.
Advertisement
Advertisement